సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ.. కొత్త సీపీ ఎవరంటే?

Update: 2021-08-25 10:50 GMT
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డైనమిక్ పోలీస్ ఆఫీసర్..సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ను బదిలీ చేసింది. ఈ నిర్ణయం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సజ్జనార్ ను టీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక సజ్జనార్ స్థానంలో కొత్త సీపీగా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. 1999 బ్యాచ్ కు చెందిన రవీంద్ర ప్రస్తుతం వెస్ట్ జోన్ ఐజీపీగా బాధ్యతల్లో ఉన్నారు.

1996 బ్యాచ్ కు చెందిన వీసీ సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా మూడేళ్ల పాటు సేవలు అందించారు. 2019లో ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ తో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అలాగే 2008లో వరంగల్ లో జరిగిన స్వప్నిక, ప్రణితలపై యాసిడ్ దాడి ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసి సజ్జనార్ సింహస్వప్నంలా నిలిచారు. ఇక మెదక్ ఎస్సీగా ఉన్న సమయంలో గంజాయి స్మగ్లర్ బిక్యూ నాయక్ ను ఎన్ కౌంటర్ లో కాల్చి చంపడం కలకలం రేపింది.

ఇలా పలు ఎన్ కౌంటర్లలో డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సజ్జనార్.. కడప జిల్లాలో పులివెందుల ఏఎస్పీగా పనిచేసిన సమయంలోనూ ఎన్ కౌంటర్లు చేశాడు. ప్రస్తుతం సైబరాబాద్ సీపీగా చెరగని ముద్ర వేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ కు బాటలు వేశాడు. ప్రస్తుతం ఆయన బదిలీపై ఆయన అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. అడిషినల్ డీజీగా పదోన్నతి రావడంతోనే ఆయన బదిలీ జరిగిందని తెలిసింది.




Tags:    

Similar News