'హికా' డేంజర్.. ముంబైకి హైఅలెర్ట్..

Update: 2019-09-25 05:39 GMT
దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకులా వణుకుతోంది. ఆరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. హికా తుఫాన్ దూసుకోస్తోంది. ఈ ‘హికా’ తుఫాన్ కారణంగా ముంబై సహా మహారాష్ట్ర తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. తుఫాన్ బీభత్సం భారీగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

హికా తుఫాన్ ముంబై నుంచి ఒమన్ దిశగా పయనిస్తోందని..కానీ ముంబై కి ముప్పు వీడలేదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సముద్రంలోకి మత్య్సకారులు - పర్యాటకులను మహారాష్ట్ర సర్కారు నిషేధించింది.

బుధవారం తెల్లవారుజాము నుంచి ముంబై సమీప ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.ఈ తుఫాన్ ఆగ్నేయ దిశలో ఏర్పడిందని.. ముంబై నుంచి గుజరాత్ టు ఒమన్ లోని డక్మ్ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని కారణంగా ఏకధాటిగా వర్షాలు పడి మొత్తం వరద ముంచెత్తుతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ  పేర్కొంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణ భారత్, బంగాల్ ఈశాన్యం, రాజస్థాన్ వాయువ్యంలో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
    

Tags:    

Similar News