సెప్టెంబర్ 19 బుధవారం 2018 దినఫలాలు

Update: 2018-09-19 04:36 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:   వృత్తి - వ్యాపారాల్లో ఊహించని విజయాలు దక్కుతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరగవుతుంది. గౌరవ - ప్రతిష్టలు పెంపొందుతాయి. ఉన్నతాధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. అనవసర మాటలు వివాదాలకు దారితీస్తాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలహాలు. ఉద్యోగ - కార్మిక - విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

వ‌ృషభరాశి: పొదుపు పథకాలపై మంచి ఫలితాలు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. రక్షణ - న్యాయ - బోధన - ఆడిటింగ్ - ప్రకటనలు - ట్రావెల్ రంగాల వారికి ప్రోత్సాహకరమైన రోజుది. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారమవుతుంది. సమస్యలు తలెత్తుతాయి. మీ వాహనం ఇతరులకు ఇవ్వకపోవడం మంచిది..

మిథున రాశి: పెట్టుబడులపై మంచి ఫలితాలొస్తాయి. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. సకాలంలో చేతికి డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొంటారు. ఫుణ్యక్షేత్రాలతో మానసిక ప్రశాంతత. మీరు చేయని పనులపై నిందలు. కొత్త పనులు చేపట్టకుండా ఉన్నవాటిపై శ్రద్ధ పెట్టండి. కోర్టు వ్యవహారాలతో ఆందోళన.

కర్కాటకరాశి:  అంచనాలు అందుకుంటారు. అనుబంధాలు విస్తరిస్తాయి. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు అనుకూల సమయం. శ్రీవారు - శ్రీమతితో చర్చలు - ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.  రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. ఫోం - లెదర్ - వ్యాపారులకు పురోభివృద్ధి. రవాణా - మెకానికల్ - ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి.

సింహరాశి: సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. అదనపు ఆదాయం లభిస్తుంది. వ్యవసాయం - పరిశ్రమలు - హోటల్ - అస్పత్రి రంగాల వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్లు - ఇంక్రిమెంట్లు అందుకుంటారు. సాహస ప్రయత్నాలు వద్దు. డబ్బు పొదుపు చేయలేకపోతే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యుల రాకపోకలు అధికమవడం వల్ల మీ కార్యక్రమాలు వాయిదా పడగలవు. 

కన్యరాశి : బోధన - గార్మెంట్స్ - ఆడిటింగ్ - రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రేమలు ఫలిస్తాయి. చిట్ ఫండ్ - బ్యాంకులతో లావాదేవీలు లాభిస్తాయి.సంతతి విషయంలో సంకల్పం ఫలిస్తుంది. కొబ్బరి - పండ్లు - పూలు - పానీయ - కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి - శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఆలయం సందర్శనతో ప్రశాంతత.

తుల రాశి: దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరుతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. బదిలీలు - మార్పులకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు.  రియల్ ఎస్టేట్  - నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టర్లకు - చిన్నతరహా పరిశ్రమల వారికి చికాకులుంటాయి.  ఇంజనీరింగ్ వారికి గడ్డుకాలం. రుణవిముక్తులు కావడంతో పాటు తాకట్టు వస్తువులను విడిపించుకుంటారు. పనులు త్వరగా పూర్తిచేస్తారు.

వృశ్చికరాశి: కమ్యూనికేషన్ రంగంలోని వారికి శుభప్రదం. విలువైన పత్రాలు చేతికి అందుతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు - ప్రయాణాలు ఫలిస్తాయి. స్నేహం, అనుబంధాలు బలపడతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపార విస్తరణకు భాగస్వాములతో కలిసి నూతన పథకాలు రూపొందిస్తారు. విద్యార్థులు బయటతిండితో అనారోగ్యాలకు గురవుతారు. రాజకీయ పరిచయాలతో లబ్ధి.

ధనురాశి: తల్లిదండ్రుల సహకారంలో లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరం. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. సేవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు.

మకరరాశి: రక్షణ - రవాణా - టూరిజం - ఆడిటింగ్ - రంగాల వారికి ప్రోత్సాహకరం. కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు - సమావేశాలు - వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. అంచనాలు అందుకుంటారు.

కుంభరాశి: వాయిదా పడుతున్న పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్యా - విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సమకూరుతాయి. పెట్టుబడులు - పొదుపు పథకాల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు.

మీనరాశి: జనసంబంధాలు విస్తరిస్తాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్  - నిర్మాణ రంగాల వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. వేడుకలతో ఇల్లు సందడిగా మారుతుంది. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.
Tags:    

Similar News