నవంబర్ 12 సోమవారం 2018 దినఫలాలు

Update: 2018-11-12 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
  
మేషరాశి: అప్పులు తీర్చాలని వేధింపులు. ఆర్థిక విషయాల్లో నిరాశ. శారీరక రుగ్మతలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకూలించదు. ఐటీ నిపుణులు వివాదాల్లో చిక్కుకుంటారు. విద్యార్థులకు కష్టమే మిగులుతుంది. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. విఘ్నేశ్వర స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృషభరాశి: వ్యాపారాల్లో నష్టాలు. అప్పులు చేస్తారు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు చిక్కులు. ఐటీ నిపుణులకు మార్పులు. విద్యార్థులకు కొద్దిపాటి సమస్యలు. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మిథునరాశి: రాబడి పెరుగుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం.  ఆప్తులతో వివాదాల పరిష్కారం. రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం. పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకూలం. ఐటీ నిపుణులు ఊహించని అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులు లక్ష్యం సాధిస్తారు. మహిళలకు భూలాభాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి:  అదనపు రాబడి. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. వ్యాపారవృద్ధి - ఉద్యోగస్థులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. మహిళలకు మానసిక ప్రశాంతత. శ్రీరామస్తోత్రాలు పఠిస్తే మంచిది.

సింహరాశి: శారీరక రుగ్మతలు.  వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు కొన్ని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనల్లో మార్పులు. ఐటీ నిపుణులు నిర్ణయాల్లో తొందరపడరాదు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.

కన్యరాశి: ఇంటాబయటా ఒత్తిడులు. సోమ్ములో జాప్యం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు కొన్ని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి వివాదాలు. ఐటీ నిపుణులకు పరిస్థితులు అనుకూలించవు. విద్యార్థులకు అంచనాలు తలకిందులు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. కనకధారా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

తులరాశి: వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామిక, కళారంగాల వారికి చిరకాల కోరిక నెరవేరుతుంది. ఐటీ నిపుణులకు ఇబ్బందులు తొలుగుతాయి. విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది. మహిళలకు సోదరుల నుంచి కీలక సమాచారం. ఆంజనేయ దండకం పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక, కళారంగాల వారికి పర్యటనలు వాయిదా.. ఐటీ నిపుణులకు అవకాశాల్లో నిరాశ. విద్యార్థులు ఆచితూచి ముందుకు సాగాలి. మహిళలకు మానసిక ఆందోళన. అంగారక స్తోత్రాలు పఠిస్తే మంచిది.

ధనస్సురాశి: పాత బాకీలు వసూళ్లు. పనుల్లో పురోగతి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణులకు అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు సోదరులతో సఖ్యత. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మకరరాశి: భూవివాదాలతో సమస్యలు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగావకాశాలు చేజారి నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు కుటుంబంలో సమస్యలు. కనకదుర్గా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కుంభరాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. గృహ వాహనయోగం. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయ, కళారంగాల వారికి సంతోషం కలిగించే వర్తమానాలు. ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు. మహిళలకు ఆస్తిలాభాలు. అన్నపూర్ణాష్టకం పఠిస్తే మంచిది.

మీనరాశి: శుభవార్తలందుతాయి. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. కాంట్రాక్టులు పొందుతారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామిక - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు అప్రయత్న కార్యసిద్ధి. విద్యార్థులకు ఉత్సాహవంతం. మహిళలకు భూలాభాలు. విష్ణు ధ్యానం చేస్తే మంచిది.
Tags:    

Similar News