ఈటెల ఎదుటే ర‌జాకార్ల రోజులని అనేశాడు

Update: 2017-04-06 04:36 GMT
పేరుకు తగ్గ‌ట్టే ఈటెల్లాంటి మాట‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించే తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ కు ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న క‌ల‌లో కూడా ఊహించ‌ని ఘ‌ట‌న‌తో అవాక్క‌య్యారు. అంత‌లోనే స‌ర్దుకొని.. త‌న వాద‌న‌ను వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు.. ఆయ‌న నేతృత్వం వ‌హిస్తున్న టీఆర్ ఎస్‌ కు ఈటెల ఎంత విధేయుడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఆయ‌న చేసిన పోరాటం అంతాఇంతా కాదు.

ఇదంతా ఒక ఎత్తు.. తాజాగా కేసీఆర్ స‌ర్కారు తీరుపై ఒక ద‌ళిత నేత విరుచుకుప‌డిన వైనం ఈటెల‌కు తీవ్ర ఇబ్బందిని క‌లిగించింది. క‌రీంన‌గ‌ర్ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు.. అధికార‌పార్టీలో కొత్త క‌ల‌క‌లాన్ని తీసుకొచ్చింది. కేసీఆర్ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో భారీ ప‌ట్టు ఉంద‌న్న మాట స‌ర్వ‌త్రా వినిపిస్తున్న‌వేళ‌.. అందుకు భిన్నంగా ఆయ‌న పాల‌న‌పై ఎంత అసంతృప్తి ఉంద‌న్న విష‌యాన్ని తెలియ‌జేసే ఘ‌ట‌న చోటు చేసుకుంది.

బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి సంద‌ర్భంగా ఒక కార్య‌క్ర‌మాన్ని క‌రీంన‌గ‌ర్ లో ఏర్పాటు చేశారు. అధికార‌ప‌క్ష ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ మీటింగ్‌ కు మంత్రి ఈటెల హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన ద‌ళిత నేత మేడి మ‌హేశ్.. ఈటెల ఏమాత్రం ఊహించ‌ని వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ద‌ళితుల్ని అణిచివేస్తున్నార‌ని.. ర‌జాకార్ల రోజులు గుర్తుకు వ‌స్తున్నాయంటూ తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు.

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ద‌ళితుల‌పై దాడులు అంత‌కంత‌కూ పెరుగుతున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. గ‌త జ‌యంతి సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ద‌ళితుల స‌మ‌స్య‌ల పరిస్కారం  కోసం మూడు నెల‌కోసారి వ‌చ్చి స‌మావేశం నిర్వ‌హిస్తాన‌ని మంత్రి ఈటెల హామీ ఇచ్చార‌ని.. కానీ దాన్నినెర‌వేర్చ‌లేద‌ని గుర్తుచేశారు.

ద‌ళిత నేత మాట‌ల‌తో ఉలిక్కిప‌డ్డ ఈటెల‌.. టీఆర్ ఎస్ స‌ర్కారు అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని ఏక‌ర‌వు పెట్టారు. ర‌జాకార్ల ప్ర‌భుత్వంతో పోల్చ‌టం గుండెను కెలికింద‌ని వ్యాఖ్యానించారు. గ‌డిచిన మూడేళ్ల కాలంలో ద‌ళితులు.. వెనుక‌బ‌డి వ‌ర్గాల కోసం టీఆర్ ఎస్ స‌ర్కారు ఖ‌ర్చు చేసిన మొత్తాల్ని సుదీర్ఘంగా వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూపంపిణీపై ఈటెల చెప్పిన మాట‌లు సంతృప్తి క‌రంగా లేవన్న మాట వినిపిస్తోంది. ఈటెల లాంటి హార్డ్ కోర్ టీఆర్ ఎస్ ఎదుట‌.. ర‌జాకార్ల‌తో కేసీఆర్ స‌ర్క‌రును పోల్చ‌టం సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News