రాత్రి చేసే ఉద్యోగాలతో యమ డేంజర్

Update: 2019-09-30 05:57 GMT
ఉద్యోగాలు ఒకప్పుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ సాగేవీ. కానీ నేడు కాలం మారింది.. పనివిధానం మారింది. సేవలు - మీడియా - ఐటీ  సహా చాలా ఉద్యోగాలు రాత్రిపగలూ కొనసాగుతున్నాయి. డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తూ అందరూ ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు.

పగలు చేసే ఉద్యోగాల కంటే రాత్రి చేసే ఉద్యోగాలతో యమ డేంజర్ అని తాజాగా ఒఖ సర్వేలో తేలింది. బ్రిటన్ శాస్త్రవేత్తలు దాదాపు 28438 మంది ఉద్యోగుల పనివేళలు, వారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల వివరాలు సేకరించి పరిశీలించారు. ఈ పరిశోధనలో దిగ్బ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి..

పగటి ఉద్యోగుల కంటే రాత్రి ఉద్యోగం చేసే వారు మానసిక కుంగుబాటుకు గురి అవుతారని బ్రిటన్ పరిశోధకులు తేల్చారు. రాత్రి ఉద్యోగాలు చేసే వారు చిన్న విషయాలకే చికాకుపుడతూ కసురుకుంటూ అరుస్తూ లోలోలప కుమిలిపోతారని.. ఒంటరిగా మిగిలిపోయామని ఆత్మనూన్యతా భావానికి గురి అవుతారని పరిశోధకులు గుర్తించారు.

ఇలాంటి వారు పగలు వ్యాయామం చేయడం.. కుటుంబంతో గడపడం చేస్తే ఈ మానసిక కుంగుబాటు నుంచి బయటపడుతారని బ్రిటన్ పరిశోధకులు తేల్చారు.
Tags:    

Similar News