విద్యాసంస్ధల విషయంలో మిగిలిన రాష్ట్రాలు ఒకలాగ వ్యవహరిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మరోలాగ వ్యవహరిస్తోంది. నిజానికి విద్యాసంస్ధలు కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్ గా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎప్పుడో గమనించారు. విద్యాసంస్ధల్లో వందల, వేలాది మంది ఉంటారు కాబట్టి వీళ్ళల్లో ఏ కొద్దిమందికి సోకినా వెంటనే మిగిలిన వాళ్ళకు చాలా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు కూడా ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు.
నిపుణుల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకునే మిగిలిన రాష్ట్రాలు విద్యాసంస్ధలను మూసేశారు. మొదటిసారే కాదు ఇపుడు సెకెండ్ వేవ్ లో కూడా ప్రభుత్వాలు ముందుగా విద్యాసంస్ధల మూసివేతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాయి. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో విద్యాసంస్ధలను మూసేశారు. పరీక్షలను వాయిదావేయటం, లేకపోతే ఆటోమేటిక్ గా పాస్ చేయటయే చేసేశారు.
కరోనా సెకెండ్ వేవ్ రెట్టించిన స్పీడుతో దేశమంతా వ్యాపిస్తోంది. ముందుగా విద్యాసంస్ధల్లో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఒకవైపు సమస్య కళ్ళముందే కనబడుతున్నా ఏపిలో మాత్రం విద్యాసంస్ధలను మూతవేయటంలో ఎందుకు ప్రభుత్వం వెనకాడుతోంది. విద్యాసంస్ధలను మూసేయటాన్ని ప్రభుత్వం ప్రిస్టేజిగా తీసుకుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 24 గంటల్లో 5086 కేసులు బయటపడ్డాయి.
విద్యాసంస్ధల్లో తరగతికి 60 మంది పిల్లలు సగటును ఉంటారు. వీరిలో ఏ ఒకరిద్దరికి వచ్చినా చాలు మిగిలినందరికీ వచ్చేస్తుంది. గతంలో ఇలాంటి సమస్యలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలిసినా ప్రభుత్వం ఇంకా విద్యాసంస్ధలను నడుపుతునే ఉంది. ప్రభుత్వం ఎంతచెప్పినా భౌతికదూరం పాటించటం, మాస్కులు పెట్టుకోవటం విద్యాసంస్ధల్లో సాధ్యంకాదు.
ఈ విషయాలు గమనించే విద్యార్ధులను రక్షించుకునేందుకు చాలా రాష్ట్రాలు విద్యాసంస్ధలను మూసేశాయి. కాబట్టి ఇఫ్పటికైనా జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని వెంటనే విద్యాసంస్ధలను మూసేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు, అనంతపురం, కృష్ణా, కడప, చిత్తూరు జిల్లాల్లోని అనేక స్కూళ్ళల్లో తమ పిల్లలను తల్లి,దండ్రులు స్కూళ్ళకు పంపటం మానేశారని సమాచారం. ప్రమాదం ముంచుకు రాకముందే ప్రభుత్వమే అధికారికంగా నిర్ణయం తీసుకుంటే మంచిది.