కరోనా మహమ్మారి జోరు దేశంలో రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా దాదాపుగా 50వేల మార్కును చేరుకుంటూ, దరిదాపుల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 48,916 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 757 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 13,36,861కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 31,358కి చేరింది. 4,56,071 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 8,49,431 మంది కోలుకున్నారు. . రికవరీ రేటు 63.5 శాతంగా ఉండటం ఒకింత ఉపశమనం కలిగించే విషయం. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 456071గా నమోదయ్యాయి. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,58,49,068 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,20,898 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.
ఇకపోతే , ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బీభత్సం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 8147 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80858కి పెరిగింది. అలాగే తెలంగాణలో కొత్తగా మరో 1640 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,466కి పెరిగింది. ఇక మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోని కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,57,117కి చేరుకోగా.. మరణాల సంఖ్య 13,132కి చేరుకుంది.