భారత్ లో కరోనా జోరు : 57 లక్షలు దాటిన కేసులు , 90 వేలు దాటిన మరణాలు

Update: 2020-09-24 06:00 GMT
ఇండియా‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు కాస్త తగ్గినప్పటికీ , కరోనా కేసుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. ఇకపోతే తాజాగా గడిచిన 24 గంటల్లో 83,347 మందికి కరోనా మహమ్మారి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 1,085 మంది మరణించారు. అలాగే గడిచిన  89,746 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,46,010కి చేరింది. కరోనాను జయించి 45,87,613 మంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్ ‌తో పోరాడుతూ 90,020 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం మనదేశంలో 9,68,377 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఐతే కొత్త కేసులు కాస్త తగ్గు ముఖం పట్టడం.. రికవరీలు పెరగడం ఊరటనిచ్చే విషయం. ఇక , గడిచిన 24 గంటల్లో మనదేశంలో 9,53,683 శాంపిల్స్ పరీక్షించారు. దేశంలో ఇప్పటి వరకు 6 కోట్ల 62 లక్షల 79,462 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ఇక, మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర లో ఇప్పటి వరకు 12,42,770 మందికి కరోనా సోకగా.. 33,407 మంది మరణించారు. ఇక రెండో స్థానం లో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటి వరకు 6,39,302 కేసులు నమోదవగా.. 5,461 మంది చని పోయారు.
Tags:    

Similar News