భారత్ లో కరోనా జోరు .. 24 గంటల్లో 85362 పాజిటివ్ కేసులు

Update: 2020-09-26 05:30 GMT
ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే  ఉంది. వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, అప్పుడే అందుబాటులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారి భారత్ లో తన దూకుడు చూపిస్తుంది. మనదేశంలో  లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 85362 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 59,03,932కి పెరిగింది. అలాగే... 24 గంటల్లో 1089 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 93,379కి చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.6 శాతం ఉండగా... ప్రపంచ దేశాల్లో అది 3 శాతంగా ఉంది.

ఇక ఇప్పటివరకు ఇండియాలో కొత్తగా 93420 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అందువల్ల మొత్తం రికవరీ కేసుల సంఖ్య 4849584కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు మరింత పెరిగి 82.1 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్ లో  యాక్టివ్ కేసుల సంఖ్య 960969కి చేరింది. ఇక , ఇండియాలో నిన్న 13లక్షల 41వేల 535 టెస్టులు చేశారు. మొన్నటి కంటే 150874 టెస్టులు తక్కువగా జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 7కోట్లను దాటింది. ఇండియాలో మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 177794 కొత్త కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 13లక్షలు దాటింది.

ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 7,073 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 661458కి పెరిగింది. కొత్తగా 48 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5606కి చేరింది. కొత్తగా 8,695 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,88,169 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 67,683 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీ తర్వాతి స్థానంలో తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.
Tags:    

Similar News