కరోనా అప్డేట్ : 24 గంటల్లో 82,170 పాజిటివ్ కేసులు

Update: 2020-09-28 05:00 GMT
ఇండియాలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతున్నాయి.  గత నాలుగు రోజులుగా 85 వేలకు పైగా నమోదవుతుండగా, ఈరోజు ఆ సంఖ్య 82 వేలకు వచ్చింది. దీంతో దేశంలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య 60 లక్షల మార్కును దాటాయి. అయితే కరోనా కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉంటున్నది. రోజువారీ కేసుల్లో మొదటిస్థానంలో ఉన్న భారత్‌, రికవరీ రేటులో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుండటం శుభపరిణామం.

ఇకపోతే ,  తాజాగా... 82వేల 170 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 60,74,702కి చేరింది. 24 గంటల్లో 1039 మంది చనిపోయారు. షాకింగ్ విషయం ఇదే. 27 రోజులుగా దేశంలో రోజూ వెయ్యి కంటే ఎక్కువ మందే కరోనాతో చనిపోతున్నారు. దీంతో మొత్తం కరోనా మృతులు 95,542కు పెరిగారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 7,09,394 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి  ప్రకటించింది.  దేశంలో ఇదివరకూ రోజూ 10 లక్షలకు పైగా టెస్టులు జరిగేవి... ఇప్పుడు టెస్టుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతోంది. నిన్న 7,09,394 టెస్టులే చేశారు. మొన్నటి కంటే అవి 278467 తక్కువ. మొత్తం టెస్టుల సంఖ్య 7 కోట్ల 19 లక్షల 67 వేల 230 ఉంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య 9,90,000 దాటింది. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 9,90,738 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటి వరకూ 3.26 కోట్ల మంది కరోనా బారినపడ్డారు.

Tags:    

Similar News