గుండెలు అదిరే నిజం బయటకు.. టెస్టు చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరికి పాజిటివ్
వంద మందికి టెస్టు చేస్తే ఐదుగురికో.. ఏడుగురికో పాజిటివ్ గా తేలటం ఒకప్పటి మాట. అలాంటి కండీషన్ ను ఇప్పుడు దేశం దారుణ పరిస్థితికి చేరుకుంది. తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవటం.. 24 గంటల వ్యవధిలో ఏకంగా మూడున్నర లక్షల మంది పాజిటివ్ గా నమోదు కావటం తెలిసిందే. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా పాజిటివిటీ రేటు దాదాపు 20 శాతంగా తేలింది.
పరీక్షించిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలుతోంది. సరిగ్గా నెల క్రితం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉండేది. కేవలం నెల వ్యవధిలో దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. నెల క్రితం పాజిటివిటీ రేటు కేవలం ఐదు శాతం మాత్రమే ఉండేది. నెల వ్యవధిలో ఇది కాస్తా నాలుగు రెట్లు పెరిగిపోయి 20 శాతంగా మారింది. ఏప్రిల్ 24న దేశ వ్యాప్తంగా 17.53 లక్షల పరీక్షలు నిర్వహిస్తే.. 3.46లక్షల మంది వైరస్ బారిన పడ్డట్లు తేలింది.
కరోనా తీవ్రత ఎంత ఎక్కువైందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో 8.36 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. రెండో వారానికి 11.67శాతం.. మూడో వారానికి 16.67 శాతానికి పెరిగింది. ఇదిలా ఉంటే.. గడిచిన మూడు రోజుల్లో పాజిటివిటీ యావరేజ్ ఏకంగా 19.32 శాతంగా మారింది. ఈ నెల 22 నుంచి రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు లక్షలు దాటుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే.. ఈ వారంతంలో నాలుగు లక్షలకు చేరుకోవటం పెద్ద విషయం కాదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది పది లక్షల కేసులు నమోదు కావటానికి చాలానే నెలలు పట్టింది. గత ఏడాది సెప్టెంబరు 18నాటికి 10.17 లక్షల కేసులు నమోదు అయితే.. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పది లక్షల కేసులు నమోదు కావటం చూసినప్పుడు.. దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. కేసుల నమోదు మాత్రమే కాదు.. మరణాల రేటు పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం చూస్తేనే.. ప్రతి నిమిషం దగ్గర దగ్గర ఇద్దరు చొప్పున కరోనా కారణంగా మరణిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 2624 మంది మరణించినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవం మరింత ఎక్కువగా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.