దేశంలో తగ్గిన కరోనా జోరు ..గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే ?

Update: 2021-05-10 06:32 GMT
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి అలాగే కొనసాగుతూనే ఉంది. అయితే, నిన్నటితో పోల్చి చూస్తే , ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం  కరోనా కేసులు కొంచెం తగ్గుముఖం పట్టడం విశేషం. గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 3,66,317 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అటు క‌రోనా బారినపడి ఆదివారం ఒక్కరోజే 3,747 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌ లో వెల్లడించింది. కాగా, ఆదివారం క‌రోనా నుంచి 3.53 లక్షల మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనాతో చనిపోయిన 3,747 మందితో కలిపి మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 2,46,146 కు చేరింది.

దేశంలో ప్రస్తుతం క‌రోనాకు చికిత్స పొందుతున్న వారిసంఖ్య 37,41,368కు చేరింది. అయితే, భారత్‌ లో మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. గత 24 గంటల్లో క‌రోనా కార‌ణంగా మహారాష్ట్రలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో నమోదైన 3,66,317 కేసుల్లో 71.75 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీతో సహా 10 రాష్ట్రాలకు చెందినవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. . దేశ వ్యాప్తంగా 17,01,76,603  మందికి వ్యాక్సిన్లు వేశారు.

 తెలంగాణలో కొత్తగా 4,976 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 4,97,361కి చేరాయి. కొత్తగా 7,646 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4,28,865కి చేరింది. రికవరీ రేటు 86.22 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 35 మంది మరణించారు. మొత్తం మరణాలు 2739కి చేరాయి. మరణాల రేటు 0.55 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 65,757 యాక్టివ్ కేసులున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌ లో తాజాగా 1,05,494 టెస్టులు చెయ్యగా... కొత్తగా 22,164 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 12,87,603కి చేరింది. కొత్తగా 92 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,707కి చేరింది. కొత్తగా 18,832 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 10,88,264కి చేరింది. ప్రస్తుతం 1,90,632 యాక్టివ్‌ కేసులున్నాయి. 
Tags:    

Similar News