ఈసారి హైదరాబాద్ లో మోఢీలిమిటేషన్ !

కేంద్రం డీలిమిటేషన్ ని అమలు చేయాలనుకుంది. అది చాలా సజావుగా సాగిపోతుంది అని కూడా భావించింది.;

Update: 2025-03-22 16:30 GMT

కేంద్రం డీలిమిటేషన్ ని అమలు చేయాలనుకుంది. అది చాలా సజావుగా సాగిపోతుంది అని కూడా భావించింది. కానీ అనుకోని అవాంతరంగా తమిళనాడు నుంచి తొలి వ్యతిరేకత వ్యక్తం అయింది. డీఎంకే రూపంలో మోడీని ఢీ కొట్టేందుకు రంగం సిద్ధం చేయడమే కాదు కేంద్రం తలపెడుతున్న డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు కీలక నేతలను డీఎంకే కూడగట్టడం జరిగింది.

అలా చెన్నై వేదికగా డీఎంకే ఇచ్చిన ఆహ్వానం మేరకు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. ఒక విధంగా ఈ భేటీని సక్సెస్ చేశాయి.డీలిమిటేషన్ వల్ల కలిగే ముప్పుని ఎలుగెత్తి చాటాయి. ఒక విధంగా ఉమ్మడి కార్యాచరణకు రంగం సిద్ధం చేశాయి.

ఈ సందర్భంగా డీఎంకే అధినేత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ తాము కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ ని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో అది దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా న్యాయంగా ఉండాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే డీలిమిటేషన్ మీద తరువాత అఖిలపక్ష సమావేశం హైదరాబాద్ లో పెట్టాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దానికి స్టాలిన్ అంగీకరించారు. దాంతో వచ్చే అఖిలపక్ష సమావేశం హైదరాబాద్ లో ఉండవచ్చు అని అంటున్నారు.

డీలిమిటేషన్ మీద చెన్నై మీటింగ్ ఆరంభం మాత్రమే అని అంటున్నారు. దానికి కొనసాగింపుగా హైదరాబాద్ లో మీటింగ్ ఉంటుందని చెబుతున్నారు. మరింతమందిని ఈ భేటీలో కూడగట్టి మొత్తం దక్షిణాదిని ఏకం చేసి కేవలం డీలిమిటేషన్ మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష పూరిత విధానాల మీద కూడా పోరాడాలని నిర్ణయించారని అంటున్నారు.

దాంతోనే తదుపరి మీటింగ్ హైదరాబాద్ లో ఉంటుందని స్టాలిన్ ప్రకటించారు. అంతే కాదు ఆ మీటింగ్ తరువాత భారీ బహిరంగ సభను హైదరాబాద్ లో నిర్వహిస్తామని చెప్పారు. అంటే మెల్లగా జనంలోకి ఈ హీటెడ్ ఇష్యూని తీసుకుని వెళ్ళడం ద్వారా కేంద్రం మీద పోరాటానికి కొత్త ట్విస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నరని తెలుస్తోంది.

ఈ సమావేశం ఏప్రిల్ 15న ఉంటుందని చెబుతున్నారు. అంటే మరో నెల రోజుల వ్యవధిలో అన్న మాట. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఉన్నారు. డీఎంకే అదే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉంది. దాంతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రెండవ మీటింగ్ పెట్టడం ద్వారా ఈ సీరియస్ ఇష్యూని ఇండియా కూటమి చాలా ప్రెస్టీజియస్ గా టేకప్ చేయనుంది అని అంటున్నారు.

అయితే డీఎంకే పిలిస్తే వచ్చిన బీఆర్ ఎస్ సహా కొన్ని పార్టీలు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక వైసీపీ అయితే డీలిమిటేషన్ మీద తమ స్టాండ్ ఏంటో చెబుతూ జగన్ ప్రధానికి రాసిన లేఖ ప్రతిని స్టాలిన్ కి అందించింది. ఒక విధంగా స్టాలిన్ అంటే సానుకూలతనే వైసీపీ వ్యక్తం చేస్తోంది. మరి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లో మీటింగ్ పెడితే వైసీపీ అసలు హాజరు కాదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News