ఎయిరిండియాపై డేవిడ్ వార్నర్ కు అంత కోపం ఎందుకొచ్చింది?

మైదానంలో బౌలర్లపై బ్యాట్ తో విరుచుకుపడే డేవిడ్ వార్నర్.. తాజాగా ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.;

Update: 2025-03-23 12:28 GMT

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అటు క్రికెటర్ గానే కాకుండా.. ఇండియన్ సినిమాల్లో హీరోలను ఇమిటేట్ చేస్తూ, తెలుగు పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాడు. ఆ రకంగానూ వార్నర్ కు ఫ్యాన్స్ ఎక్కువే! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఎయిరిండియాపై విరుచుకుపడ్డాడు వార్నర్.

అవును... మైదానంలో బౌలర్లపై బ్యాట్ తో విరుచుకుపడే డేవిడ్ వార్నర్.. తాజాగా ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియాకు తాను వెళ్లాలి ఉండగా.. ఆ విమానం గంట ఆలస్యం అయ్యింది. దీంతో... ఎయిరిండియాపై వార్నర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

ఇందులో భాగంగా... పైలెట్ ఆలస్యంగా వస్తున్నాడని తెలిసి కూడా గంట ముందే బోర్డిం గ్ ఎందుకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... పైలెట్ లేని విమానంలో గంటపాటు ఎదురు చూడాలా? అని పోస్ట్ చేశారు.

దీంతో... ఎయిరిండియా స్పందించింది. విమానం ఆలస్యం అవ్వడానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణం అన్ని తెలిపింది. వాతావరణ సమస్యల కారణంగా చలా విమానయాన సంస్థలు విస్తృతంగా విమానాల మళ్లింపులు చేస్తాయని.. కొన్ని సార్లు ఆలస్యం అవుతుంటాయని తెలిపింది.

ఈ కారణంగా ఆ విమానానికి కేటాయించిన సిబ్బంది మరోపనిలో బిజీగా ఉన్నారని.. ఇది మరింత ఆలస్యానికి దారితీసిందని ఎయిరిండియా ఎక్స్ వేదికగా డేవిడ్ వార్నర్ కు వివరణ ఇచ్చింది. ఇదే సమయంలో.. అసౌకర్యానికి గురైన వార్నర్ తో పాటు ఇతర ప్రయాణికుల పట్ల ఎయిరిండియా విచారం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News