‘రోజంతా నైటీ వేసుకోమంటున్నాడు’... భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు!

గుజరాత్ లోని అహ్మదాబాద్ లోగల జుహాపురాకు చెందిన 21 ఏళ్ల ఓ మహిళ.. తన భర్త, అత్తమామలు వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది.;

Update: 2025-03-23 12:56 GMT

గుజరాత్ లోని అహ్మదాబాద్ లోగల జుహాపురాకు చెందిన 21 ఏళ్ల ఓ మహిళ.. తన భర్త, అత్తమామలు వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఇంట్లో ఉన్నప్పుడు రోజంతా నైటీ ధరించాలని భర్త బలవంతం చేస్తున్నాడని.. తాను ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు నిద్రలేవాలో ఆయనే డిసైడ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది!

అవును... 2023 మే నెలలో సౌదీ అరేబియాలో ఆ మహిళకు, ఓ డాక్టర్ కు వివాహం అయ్యింది. వివాహం తర్వాత ఆ మహిళ బాపునగర్ కు వెళ్లింది. అక్కడ భర్త, అత్తమామలతో నివసిస్తుంది! ఈ క్రమంలో తన భర్త డాక్టర్ అని, తాగుడుకు బాగా బానిసైపోయాడని, మాటలతో దూషించాడని ఆమె ఆరోపించింది.

ఈ సమయంలో అత్తమామలకు అతని ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తే... వారు కూడా అతనికే మద్దతు ఇచ్చి, మరింత దుర్భాషలాడటం ప్రారంభించారని ఆమె ఆరోపించారు. తాను ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి అన్నీ ఆయనే నియంత్రిస్తున్నాడని.. ఆయన పడుకునే ముందు అతని కాళ్లకు మసాజ్ చేయాల్సి వస్తోందని కూడా ఆమె పేర్కొంది.

ఈ క్రమంలో... గత ఏడాది మే నెలలో ఫ్యామిలీ అంతా కాశ్మీర్ కు వెళ్లి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని.. ఆ ట్రిప్ తర్వాత తాను తన పుట్టింటికి తిరిగి వచ్చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించినప్పటికీ ఆమె భర్త రాజీకి ప్రయత్నించలేదని ఆమె ఆరోపించారు.

దీంతో... తాజాగా ఆమె వెజల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే... ఆమె భర్త నుంచి కానీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు!

Tags:    

Similar News