దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ , మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇండియా లో గడిచిన 24 గంటల్లో 3,62,727 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బుధవారం 3,52,181 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 4120 మంది మరణించారు. కేసులు కాస్త తగ్గినప్పటికీ , మరణాల సంఖ్య అలాగే కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజా లెక్కలతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,37,03,665కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 1,97,34,823 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 2,58,317 మంది మరణించారు.
మనదేశంలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటకలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 46,781, కేరళలో 43,529, కర్నాటకలో 39,998, తమిళనాడులో 30,355 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. భారత్ లో మరోసారి రోజువారీ కోవిడ్ కేసులు 3.5 లక్షలు దాటాయి. భారత్ తర్వాత బ్రెజిల్ లో 25,200 కేసులు, అమెరికాలో 22,261 కేసులు, ఫ్రాన్స్, ఇరాన్ లో 18 వేల చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. రోజువారీ మరణాల్లోనూ భారత్ టాప్ లో ఉంది. డబ్ల్యూహెచ్ ఓ ప్రకారం.. వరుస మూడు రోజులుగా నమోదయిన ప్రపంచంలోని మొత్తం కేసుల్లో భారత్ అధిక వాటా కలిగి ఉంది. మే 10 నుంచి ప్రపంచం మొత్తం కేసుల్లో 50 శాతం భారత్ లోనే నమోదవుతున్నాయి. ప్రపంచం మొత్తం కోవిడ్ కేసులు.. ఒక్క భారత్ లో నమోదవుతున్న వాటి కంటే తక్కువ కావడం గమనార్హం.