వ్యాక్సిన్‌ ల పనితనం.. గందరగోళ రిపోర్ట్‌ లు

Update: 2021-06-27 01:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పదుల కొద్ది సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్‌ ను అత్యవసర వినియోగంకు అనుమతించారు. ఇండియాలో కోవాగ్జిన్‌ మరియు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ లను ఇస్తున్నారు. విదేశీ వ్యాక్సిన్ స్పుత్నిక్‌ కూడా ఇండియాకు వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ ల పనితనం గురించి పలు సంస్థలు చేస్తున్న సర్వేలు.. అవి ఇస్తున్న రిపోర్ట్‌ లు జనాల్లో గందరగోళంకు గురి చేస్తున్నాయి.

వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారిన పడటం మాత్రమే కాకుండా మృతి చెందుతున్నారని.. అందుకే కరోనా వ్యాక్సిన్‌ తీసుకోక పోవడం మంచిదంటూ కొందరు అంటూ ఉంటే.. కొందరు మాత్రం కనీసం ఒక్క డోస్ తీసుకున్నా కూడా వైరస్‌ ప్రభావం నుండి బయట పడవచ్చు అంటూ రిపోర్ట్‌ ఇస్తున్నారు.

కరోనా వ్యాక్సినేషన్‌ పక్రియ జరుగుతున్న ఈ సమయంలోనే ఆ వ్యాక్సిన్‌ మంచిది.. ఈ వ్యాక్సిన్‌ మంచిదనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో జనాలు ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ఇంకా రకరకాలుగా ఆరోగ్య సంస్థలు ఇస్తున్న సర్వే రిపోర్ట్‌ లు మరియు స్టడీ రిపోర్ట్‌ లు వ్యాక్సిన్‌ అంటేనే భయపడేలా ఉన్నాయి.

కొత్తగా వస్తున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఖచ్చితంగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై కూడా తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం అంటూ కొందరు భయాందోళనలు కలిగిస్తున్నారు. పలు దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌ సోకిన వారి గురించి ఇప్పుడు అధ్యయనం చేస్తున్న వారు చెబుతున్న విషయం ఏంటీ అంటే రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా తీవ్ర ప్రభావంకు గురవ్వాల్సి ఉంటుందట.

వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతున్న సమయంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏ వ్యాక్సిన్‌ మంచిది అనే విషయం నుండి మొదలుకుని వాటి వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఇంకా రకరకాల విషయాల గురించి మీడియాలో వార్తలు వస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. డబుల్‌ డోస్‌ తీసుకున్న వారు ముందు ముందు మళ్లీ మళ్లీ కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు అంటూ కొందరు.

మళ్లీ మళ్లీ అక్కర్లేదు బూస్టర్‌ డోస్ ఒక్కటి చాలు అంటూ కొందరు అంటూ ఉంటే వ్యాక్సిన్ లు తయారు చేసిన సంస్థలు మాత్రం బూస్టర్ డోస్‌ లు కూడా అక్కర్లేదు ఈ రెండు డోసులతో కరోనాకు చెక్‌ పెట్టవచ్చు అంటూ చెబుతున్నారు. మొత్తానికి కరోనా వ్యాక్సిన్ గురించి జరుగుతున్న ప్రచారంకు తోడు ప్రముఖులు వేరు వేరు అభిప్రాయాలు చెబుతున్న కారణంగా జనాలు అంతా కూడా గందరగోళంతో జుట్టు పీక్కుంటున్నారు.
Tags:    

Similar News