ఊపిరి పీల్చుకున్న న్యూయార్క్ న‌గ‌రం

Update: 2020-06-09 01:30 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్‌ కు తీవ్రంగా ప్ర‌భావిత‌మైన దేశం అగ్రరాజ్యం అమెరికా. ల‌క్ష‌ల్లో కేసులు ఈ ఒక్క దేశంలో న‌మోద‌య్యాయి. ప్ర‌ధానంగా ఈ దేశంలోని న్యూయార్క్ రాష్ట్రం లో మ‌రింత తీవ్రంగా వైర‌స్ విజృంభించింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే వైర‌స్ మృతులు 22 వేలకు పైగా ఉండ‌డం క‌ల‌చి వేసే విష‌యం. వైరస్‌ కు హాట్‌స్పాట్‌ గా ఇన్నాళ్లు న్యూయార్క్ ఉండ‌గా ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. తొలిసారి ఒక రోజు ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. దీంతో దాదాపు మూడు నెలల త‌ర్వాత ఆ న‌గ‌రం ఊపిరి పీల్చుకుంది. ఇది వారం రోజులుగా ఒక్క వైర‌స్ మరణం కూడా లేక‌పోవ‌డంతో స్థానికులు, అక్క‌డి ప్ర‌జ‌లు ఆనందం లో మునిగారు. హ‌మ్మ‌య్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. దీంతో కొన్ని నెలల త‌ర్వాత న్యూయార్క్‌ సిటీలో కార్యక్రమాలు - సాధార‌ణ ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ప్రపంచ వ్యాణిజ్య నగరంగా పేరొందిన న్యూయార్క్‌ లో వైర‌స్ తీవ్ర స్థాయిలో విజృంభించిన విషయం తెలిసిందే. వైరస్‌ ధాటికి కేవలం ఈ ఒక్క నగరంలోనే దాదాపు 22 వేల మందికి పైగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 1వ తేదీన న్యూయార్క్‌లో తొలి కేసు నమోదైంది. ఇక అప్ప‌టి నుంచి నెల రోజుల్లో వైరస్ తీవ్రంగా వ్యాపించి న‌గ‌రాన్ని న‌లిపేసింది. మొత్తం కేసులు 3,78,097 న‌మోదయ్యాయి. దీంతో మహానగరం కోలుకోలేని విధంగా మారిపోయింది. ఆ వైర‌స్ బాధితుల ఆస్ప‌త్రుల‌‌న్నీ కిట‌కిట‌లాడాయి. ఈ క్ర‌మంలో వృద్ధుల‌ను వ‌దిలేసి యువ‌త‌కు వైద్యం చేయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రంలో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.

మే చివరి వారం నుంచి వైర‌స్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ క్ర‌మంలో మృతులు కూడా త‌గ్గిపోయారు. ఈక్ర‌మంలోనే సోమవారం (జూన్ 8)కు కొత్తగా మృతుల సంఖ్య లేరు. మృతుల సంఖ్య జీరోకి చేరుకోవ‌డం తో ఆ న‌గ‌రం ఊపిరి పీల్చుకుంది. దీంతో వంద‌ రోజుల పాటు మూతపడిన మ‌హానగరం తిరిగి తెరుచుకుంది. మాల్స్‌, దుకాణాలు తిరిగి ప్రారంభమ‌య్యాయి. వైరస్‌ తిరిగి వ్యాప్తి చెందకుండా ప్రజలంతా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నారు.

న్యూయార్క్ సిటీలో మార్చి 11వ తేదీన మొదటి వైర‌స్ మరణం సంభవించింది. అనంతరం క్రమంగా ఈ సంఖ్య పెరుగుతూ ఏప్రిల్ 7వ తేదీకి అత్యధికంగా 590 మంది ఆ వైర‌స్‌కు బ‌ల‌య్యారు. తర్వాతి నుంచి కొద్దిగా మరణాల సంఖ్య త‌గ్గి ఇప్పుడు పూర్తిగా లేదు. శుక్రవారం నుంచి ఒక్కరు కూడా మృత్యువాత పడలేదని న్యూయార్క్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్ర‌స్తుతం వైర‌స్ అదుపులోకి రావ‌డంతో ప్ర‌జ‌ల‌తో అధికారులు, ప్ర‌భుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇక సాధార‌ణ ప‌రిస్థితి ఏర్ప‌డి కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అయితే అమెరికా వ్యాప్తంగా కేసులు భారీగానే న‌మోద‌వుతున్నాయి. రోజుకు సగటున 20 వేల వరకు కేసులు తేలుతున్నాన్నాయి. ప్రస్తుతం 20 లక్షలకు చేరువలో ఉండ‌‌, మృతులు లక్షా 12 వేలు ఉన్నారు.
Tags:    

Similar News