హైదరాబాద్ లోని ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్ట్ లకు మరోసారి బ్రేక్ పడింది. నాలుగు రోజుల పాటు ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులు బంద్ చేయనున్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం శానిటైజేషన్ కోసం ల్యాబుల్లో కరోనా టెస్టులను నిలిపివేశారు. ఈ సందర్భంగా రిపోర్టుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు.
ఈ క్రమంలో కరోనా టెస్టుల సేకరణ, టెస్టింగ్ లపై ల్యాబ్ సిబ్బంది ట్రైనింగ్ అప్ డేట్ చేయనున్నారు. ఇక ప్రభుత్వ ల్యాబ్ ల్లో యథావిథిగా కొనసాగుతున్న శ్యాంపిల్ సేకరణ కొనసాగనుంది. కాగా తెలంగాణలో ఇప్పటి వరకు 80వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 17వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.
మరోవైపు, వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ప్రైవేట్ ల్యాబుల నిర్లక్ష్యం నిజమేనని తేల్చింది తెలంగాణ ప్రభుత్వం. తీరు మార్చుకోకపోతే.. లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. వారం రోజుల క్రితం వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు 16 ప్రైవేటు ల్యాబులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం... ఆ ల్యాబుల్లో పరిస్థితులను పరిశీలించేందుకు గాను ఓ కమిటీ ని కూడా ఏర్పాటు చేసింది. ప్రైవేటు ల్యాబులను పరిశీలించిన కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక లో ఆందోళన కలిగించే విషయాలు వెలుగు చూశాయని వైద్య ఆరోగ్యా శాఖ ప్రకటించింది. టెస్టులకు సంబంధించి తప్పుడు రిపోర్టులు ఇస్తున్న ల్యాబ్‌లకు అనుమతులు రద్దు చేసింది