తెలంగాణాలో కరోనా కలకలం కొనసాగుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌లో ఈ మహమ్మారి ఉధృతి తీవ్రంగా ఉంది. హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీగా నమోదవుతున్నాయి. తాజాగా కరోనా సెగ ప్రగతి భవన్ కు తాకింది. వారం రోజుల్లో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న 20 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది అని సమాచారం. దీంతో ప్రగతి భవన్ ను వైద్యాధికారుల పర్యవేక్షణ లో సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. కాగా, పాజిటివ్ కేసులు పెరుగుతుండడం తో సీఎం కేసిఆర్ ఫామ్ హౌజ్ నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
అయితే, ఈ పరిణామం పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడం లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరోనా పై ప్రధాని నరేంద్ర మోడీ పోరాటం చేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం పారి పోతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా కేసులపై ప్రజలకు అబద్దాలు చెబుతున్న సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో తినడం..ఫాంహౌస్‌లో నిద్ర పోవడం మాత్రమే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి పై రివ్యూలు చేయడం లేదు....టెస్టులు చేయించడం లేదని అర్వింద్ మండిపడ్డారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ మాస్క్ కూడా ధరించడం లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆటల రాజేందర్‌పై అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో వసతులు లేవని బాధితులు వీడియోలు పెట్టి చనిపోతున్నారని అర్వింద్ అన్నారు. ఈటలకు మంత్రిగా కొనసాగేందుకు నైతిక హక్కు కూడా లేదన్నారు. రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలంటూ ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. మంత్రి ఈటలకు కేంద్రంపై విమర్శలు చేసే హక్కు లేదని అన్నారు. ముందు ఆయన ఆరోగ్య శాఖ ను సరిగా చూసుకోమని అర్వింద్ సూచించారు.