మిగిలిన ఉద్యోగాల సంగతి ఎలా పోలీస్ జాబ్ అంటే అంతో ఇంతో పవర్ చేతిలోఉందని భావిస్తాం. మరి.. అదెంత వరకు నిజం. కరోనా కాలంలో పోలీసు ఉద్యోగంలో ఉన్నా.. చేతిలో రూ.2లక్షలు క్యాష్ ఉన్నా.. వైద్యం చేయించుకోలేక కళ్ల ముందే భార్య ప్రాణాల్ని కోల్పోయిన విషాదకర ఉదంతంగా దీన్ని చెప్పాలి.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ దారుణం చూస్తే.. ఇవాల్టిరోజున పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి సదరు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘నా భార్యను యశోదా హాస్పిటల్‌కు తీసుకెళ్లా. ఈసీజీ తీసి పల్స్ రేట్ తక్కువగా ఉందన్నారు. రూ.2 లక్షలు ఉన్నాయని చెప్పా. అయితే.. ఐసీయూలో బెడ్లు ఖాళీగా లేవన్నారు. నా కళ్ల ముందే మరో పేషెంట్ ను ఐసీయూలో చేర్చుకున్నారు. దీంతో.. సరూర్‌నగర్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాన. సిటీ స్కాన్ తీసి లంగ్స్‌లో ప్రాబ్లం ఉందన్నారు. రిపోర్టులు ఉన్నాయి. రూ.2లక్షలు క్యాష్ ఉందన్నా. ఆసుపత్రిలో ఆడ్మిట్ చేసుకోవాలన్నా. తెల్లారితే మరో రూ.3లక్షలు కూడా చెల్లిస్తానని చెప్పా. అయినా చేర్చుకోలేదు’’
‘‘దీంతో సీపీ సార్ కు ఫోన్ చేశా. ఏదైనా హాస్పిట్ లో చేర్చించాలని చెప్పారు. ఒక్కణ్నే మళ్లీ యశోదాకు వెళ్లా. అక్కడ బెడ్లు ఖాళీ లేవని చెప్పారు. దీంతో.. ఓమ్నీ.. అమ్మ.. కామినేని హాస్పిటళ్లకు వెళ్లినా ఐసీయూ బెడ్లు ఖాళీ లేవని చెప్పారు. దీంతో.. సీపీ సార్ తో ఫోన్ చేస్తే.. గాంధీకి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో.. గాంధీకి వెళ్లా’’
‘‘గాంధీ ఆసుపత్రికి వెళ్లా. అక్కడ చిలకలగూడ సీఐ ఉన్నారు. నన్ను నేను పరిచయం చేసుకున్నా. హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నానని చెప్పా. కరోనా ఉందో లేదో తెలీదని.. ఏ ఆసుపత్రికి వెళ్లినా చేర్చుకోలేదని సీఐ సార్ కు చెప్పా. నా భార్య చావుబతుకుల్లో ఉంది ఆసుపత్రిలోకి వెళ్లి.. వైద్యం చేయించుకోవటానికి అనుమతి ఇవ్వమని చెప్పా. కానీ..ఆయన మాత్రం స్పందించ లేదు’’
‘‘కరోనా పాజిటివ్ ఉంటేనే లోపలకు వెళ్లనిస్తానని చెప్పి.. గేటుకు తాళం వేయించారు. రాత్రి ఒంటి గంట సమయంలో అక్కడి నుంచి బయటకు పంపించారు. వైద్యం చేయించాలని వేడుకున్నా. కానీ.. ఆయన మాత్రం అందుకు ససేమిరా అన్నారు. తిరిగి గాంధీ నుంచి అంబులెన్సులో ఒక కిలోమీటర్ వచ్చే సరికి నా భార్య చనిపోయింది. నా కళ్ల ముందే నా చేతుల్లోనే కాళ్లు.. చేతులు కొట్టుకొని ఊపిరి ఆడని కారణంగా నా భార్య చనిపోయింది. చేతిలో రూ.2లక్షలు ఉన్నాబతికించుకోలేకపోయా’’ అంటూ తన ఆవేదనను వెల్లడించారు. ఓపక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లోపెద్ద ఎత్తున బెడ్లు ఖాళీలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉండటం గమనార్హం.