భక్తులు ఎవరైనా దేవుడికి ఒకటే. కానీ.. దైవానికి.. భక్తులకు మధ్య నుండే మధ్యవర్తుల పుణ్యమా అని జనరల్.. వీఐపీ.. వీవీఐపీలు లాంటివి వచ్శాయి. మామూలు గుళ్లల్లోనే ఇలాంటి ఏర్పాటు ఉంటే.. నిత్యం వేలాది మంది భక్తులు తరలి వచ్చే దేవాలయాల్లో ఈ వ్యత్యాసం చాలానే ఉంటుంది. ఎక్కడిదాకానో ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వ్యవహారమే చూడండి.. వీవీఐపీల సేవలో తరిస్తూ ఉంటుంది. వేలాది మంది సాధారణ భక్తుల విషయం కంటే కూడా పదుల సంఖ్యలో వచ్చే వీవీఐపీల మీద బోర్డుకి ఫోకస్ ఎక్కువ. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు వారు విపరీతంగా శ్రమిస్తారు.
అంతేనా.. ఎప్పుడైనా భారం మోపాల్సి వస్తే వారికి తొలుత గుర్తుకు వచ్చేది సాదాసీదా భక్తులు. లక్షల కొద్దీ వచ్చే ఈ బ్యాచ్ మీద పది రూపాయిల చొప్పున భారం మోపినా సరే.. కోట్లాది రూపాయిలు సమకూరతాయన్న విషయం వారికి బాగా తెలుసు. అందుకే.. వీవీఐపీల మనసులు నొప్పకుండా ఉండేందుకు కిందామీదా పడే టీటీడీ వారి కోసం చాలానే ఏర్పాట్లు చేస్తుంది.
ఇదిలా ఉంటే.. టీటీడీ తర్వాత దేశంలో విపరీతమైన రద్దీ ఉండే దేవాలయాల్లో ఒకటి షిర్డీ సాయిబాబా టెంపుల్. సాయినాధుడు కొలువు తీరి ఉండే మందిరాన్ని.. శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చూసుకుంటుంది. టీటీడీకి.. షిర్డి సంస్థాన్ కు మధ్యన వ్యత్యాసం చూస్తే ఔరా అనిపించక మానదు. వీవీఐపీలకు సాగిలపడే టీటీడీ వైఖరికి కాస్త భిన్నంగా ఉంటుంది షిర్డీ టెంపుల్ నిర్వహణ. భారం మోపే విషయంలో వీవీఐపీలకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. అవసరమైతే.. వీఐపీల మీద భారం మోపి.. సామాన్యులకు రిలీఫ్ ఉండేలా చేస్తుంటారు. తాజాగా అలాంటి నిర్ణయమే షిర్డీ సంస్థాన్ తీసుకుంది. ఇంతకాలం వీఐపీ పాస్ ధర రూ.100 ఉండేది.దాన్ని రూ.200గా మార్చారు. ఇక.. ఉదయం హారతి వీఐపీ పాస్ ధర రూ.500 ఉంటే ఇకపై ఇది కాస్తా రూ.600 కానుంది.
ఇక మధ్యాహ్నం హరతి కార్యక్రమం చూస్తే.. రూ.300 నుంచి రూ.400 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో సాధారణ భక్తులకు ఇకపై ఉచితంగా ప్రసాదం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ షిర్డీ ప్రసాదం నామమాత్రం ధరను మాత్రమే వసూలు చేసే వారు. ఇప్పుడు దాన్ని కూడా వదిలేసి.. ఉచితంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఏదోలా భారం మోపాలన్న లక్ష్యం టీటీడీలో కనిపిస్తే.. అందుకు భిన్నమైన ధోరణి షిర్డీ సంస్థాన్ లో కనిపిస్తుందన్న అభిప్రాయం ఉంది. ఆ ముద్రను పోగొట్టుకునేలా వ్యవహరిస్తారా? లేదా? అన్నది చూడాలి.