కొమ్ములు తిరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలామంది ఉన్నా.. ఎవరికి చేతకాని పని ఒక చోటా నాయకుడు కేసీఆర్ కు చెమటలు పట్టించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జైపాల్ రెడ్డి.. జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. భట్టి విక్రమార్క.. షబ్బీర్ అలీ.. శ్రీధర్ బాబు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు కనిపిస్తారు.కానీ.. వారు ఎవరూ చేయలేని పనిని.. దాసోజు శ్రవణ్ కుమార్ చేయటం గమనార్హం. గ్రేటర్ ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రయోజనం పొందేందుకు వీలుగా తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవోనెంబరు 207పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. ఈ జీవో మీద న్యాయపోరాటం మొదలెట్టిన శ్రవణ్ కారణంగా బుధ.. గురువారాల్లో తెలంగాణ సర్కారుకు చుక్కలు కనిపించిన పరిస్థితి.
చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా వారు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్.. డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవశం చేసుకునేందుకు.. తమ మనుషుల్ని దొడ్డిదారిన పెంచుకునేందుకు ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి జీవో నెంబరు 207ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. డిసెంబరు, 2015లో జారీ చేసిన ఈ జీవో కారణంగా.. ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యను తెలంగాణ రాష్ట్ర సర్కారు భారీగా పెంచుకునే వీలుంది.
దీనిపై గళం విప్పిన దాసోజు హైకోర్టు తలుపు తట్టారు. దీనిపై కోర్టు తెలంగాణ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు.. ఒకదశలో జీవోను నిలిపివేస్తూ నిర్ణయాన్ని ప్రకటించబోయింది. అయితే.. తెలంగాణ ఏజీ కారణంగా కాస్త సమయాన్ని పొందిన తెలంగాణ సర్కారు.. తాను చేసిన తప్పుపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
గురువారం ఈ జీవోను రద్దు చేయటమే కాదు.. దాని స్థానంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. గతంలో అనుసరించిన విధానాన్నే అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పడిన ప్రయాస అంతాఇంతా కాదు. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మంత్రుల్ని కలిసి ఆర్డినెన్స్ మీద సంతకాలు పెట్టించటం దగ్గర నుంచి.. ఆఘమేఘాల మీద గవర్నర్ వద్దకు వెళ్లి.. పరిస్థితి వివరించి.. తాజా ఆర్డినెన్స్ ద్వారా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకావన్న విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా చెప్పి.. ఓకే అనిపించి ఆమోద ముద్ర వేయించేసరికి తల ప్రాణం తోకకు వచ్చినంతపనైంది.
ఇంతటి ప్రయాసకు కారణంగా దాసోజు. ఐటీ ఇంజనీర్ గా కెరీర్ షురూ చేసి.. రాజకీయాల మీద ఇష్టంతో ప్రజారాజ్యం పార్టీలో చేరి.. పవన్ కల్యాణ్ కు దగ్గరై 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓటమి పాలైన శ్రవణ్ తర్వాత టీఆర్ ఎస్ లోచేరటం.. ఆపై కాంగ్రెస్ లో చేరటం తెలిసిందే. మంచి సబ్జెక్ట్ ఉన్న శ్రవణ్.. కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తలకాయలు చేయలేని పనిని తాను చేసి.. టీఆర్ఎస్ సర్కారుకు చుక్కలు చూపించారని చెప్పక తప్పదు.