ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఇంకా బతికే ఉన్నాడా? లేదా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? అనేవి ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు ఎందరినో వేధిస్తున్నాయి! అండర్ వరల్డ్ డాన్.. బతికే ఉన్నాడని, పాక్ లో తలదాచుకుంటున్నాడని ఎప్పటినుంచో అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే పాక్ మాత్రం దావూద్ తమ దేశంలో లేడని బుకాయిస్తోంది! అయితే ఇప్పుడు దావూద్ డొంక కదులుతోంది! భారత్ అనుమానాలే నిజమవుతున్నాయి! పాక్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది! భారత్ లో విధ్వంసం సృష్టంచేవారికి పాక్ అండగా నిలుస్తుందనేందుకు మరో బలమైన సాక్ష్యం దొరికింది. దావూద్ పాక్ లోనే తలదాచుకుంటున్నాడని అతడి సోదరుడు కస్కర్.. పోలీసులకు వెల్లడించాడు!
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు అతడి గుట్టంతా రట్టు అవుతోంది! అతడి గురించిన కీలక సమాచారాన్ని దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ ద్వారా అధికారులు తెలుసుకున్నారు. దావూద్ ఇంకా పాకిస్థాన్ లోనే ఉన్నాడని కస్కర్ తేల్చిచెప్పాడు. దోపిడీ - బెదిరింపుల కేసులో ఇక్బాల్ కస్కర్ గత మంగళవారం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే! ఇప్పుడు అతడి ద్వారా దావూద్ జాడ తెలుసుకుంటున్నారు. కస్కర్ ను నిఘా వర్గాలు - థానే క్రైం బ్రాంచీ అధికారులు సంయుక్తంగా విచారిస్తున్నారు. ఇందులో దావూద్ గురించి కీలక విషయాలను కస్కర్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
దావూద్ ప్రస్తుతం పాకిస్థాన్ లోనే ఉన్నాడని కస్కర్ చెప్పాడు. దావూద్ భారత్‌లోని తన బంధువులు - వ్యక్తులతో ఫోన్లో మాట్లాడేందుకు భయపడుతున్నాడని తెలిపాడు. ఫోన్ చేస్తే దాన్ని ట్యాప్ చేసి తనను పట్టుకుంటారేమోనని ఆందోళనలో ఉన్నాడట. దావూద్ తో కలిసి ఉంటున్న మరో సోదరుడు అనీస్ ఇబ్రహింతో ఇటీవల తాను కొన్నిసార్లు మాట్లాడినట్లు వివరించాడు. 1993 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన దావూద్.. భారత్ నుంచి పారిపోయాడు. ప్రస్తుతం అతడు పాక్ లోని కరాచీలో దాక్కొని ఉన్నట్లు సమాచారం. కాగా.. దావూద్ పేరు చెప్పి కస్కర్ ముంబయిలో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు.