సీఎంగారి సెల్ఫ్ గోల్ అంటే ఇదేనేమో !

Update: 2016-10-13 07:56 GMT
టామ్‌ ఆండ్ జెర్రీ కంటే ఎక్కువ‌గా సాగే బీజేపీ వ‌ర్సెస్ ఆప్ పోరులో మ‌రో చిలిపి విమ‌ర్శ‌కు తెర‌లేసింది. ఆప్ అధినేత‌ - ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ వినూత్న తరహాలో ఝ‌ల‌క్ ఇచ్చింది. ఈ సారి కేజ్రీవాల్ పై విమ‌ర్శ‌లు చేసి వ‌దిలేయ‌కుండా...పోస్టర్లతో దాడికి దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని  కేజ్రీవాల్ కోరిన సంగ‌తి తెలిసిందే. అదే డిమాండ్‌ తో కేజ్రీని క‌మ‌ళ‌నాథుల ఇర‌కాటంలో ప‌డేశారు.

భార‌త‌దేశం అంతా గ‌ర్విస్తున్న స‌ర్జిక‌ల్ దాడుల‌కు వ్య‌తిరేకంగా కొంద‌రి మ‌ద్ద‌తు పొందేందుకు ఆధారాలు కావాలంటున్న కేజ్రీ.. ముందు ఢిల్లీలో డెంగ్యూ వ్యాప్తికి కారణమైన దోమలపై దాడులు చేసి నియంత్రించాల‌ని బీజేపీ కోరింది. దేశ రాజ‌ధానిలోని దోమ‌ల‌ను అరికట్టి ఆ తరువాత దేశం విజ‌యం సాధించిన‌ సర్జికల్ దాడులపై ఆధారాల గురించి మాట్లాడాలంటూ బీజేపీ పోస్టర్లు ముద్రించింది. ఢిల్లీలోని కీల‌క ప్రాంతాల్లో అంటించిన‌ ఈ పోస్ట‌ర్లు ఇపుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీటిపై ప‌లువురు స్పందిస్తూ...కేజ్రీవాల్‌ స్వ‌యంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటూ ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News