కరోనా కోరలు చాస్తోంది. దేశంలో బయటకు వస్తే చాలు అందరికీ వ్యాపిస్తోంది. ఇప్పుడు చలికాలం కావడంతో తీవ్రత మరింత పెరిగింది. సామాన్యులు, ప్రజాప్రతినిధులు , ధనిక పేద తేడా లేకుండా అందరికీ సోకుతూనే ఉంది. తాజాగా బీహార్ మంత్రికి కరోనా సోకి కోలుకొని అనారోగ్యంతో మృతిచెందారు.
బీహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ మరణం ఆ రాష్ట్రంలో విషాదం నింపింది. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. అయితే మంత్రి వినోద్ సింగ్ జూన్ 28న కరోనా బారినపడ్డారు. మంత్రితోపాటు ఆయన భార్యకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో కతియర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న మంత్రికి అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స కోసం పాట్నా నుంచి ఆగస్టు 16న ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్ కు తరలించారు. రెండు నెలలుగా ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నా పరిస్థితి మెరుగుపడడం లేదు. సోమవారం ఉదయం మెదడులో రక్తస్రావం కావడంతో చనిపోయారు.
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ సింగ్ భార్య నిషాసింగ్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ప్రన్ పూర్ నుంచి భర్త స్థానంలో ఆమె పోటీచేస్తోంది. నితీష్ కేబినెట్ లో మంత్రి వినోద్ కుమార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.