ఇండోనేషియాకు డిసెంబర్‌ శాపం

Update: 2018-12-24 17:30 GMT
డిసెంబర్‌ అంటేనే ఇండోనేషియా ప్రజలు వణికిపోతున్నారు. డిసెంబర్‌ 20 దాటిందంటే వారి వెన్నులో వణుకు పుడుతుంది. టూరిస్ట్‌ లు అయితే మేం రాం బాబోయ్‌ అంటారు. కారణం.. సునామీ. తెలిసి జరుగుతుందో లేదంటే.. ఏదైనా శాపమో కానీ.. ఇండోనేషియాను కకావికలం చేసిన సునామీలు డిసెంబర్‌లోనే వచ్చాయి.

క్రాకటోవా శిశువుగా పిలుచుకునే ఓ అగ్నిపర్వతం శనివారం రాత్రి 9 గంటల సమయంలో బద్దలైంది. 24 నిమిషాల తర్వాత నీటి లోపలి భూమి కంపించి సునామీ వచ్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 250 మంది మరణించారు. దాదాపు వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. సాధారణంగా.. సముద్రం లోపల పుట్టే బడబాగ్నికి లేదంటే భూకంపాలకు సునామీలు వస్తుంటాయి. కానీ ఈసారి అగ్ని పర్వతం బద్దలవ్వడం - ఆ లావా వచ్చి సముద్రంలో పడడంతో.. సునామీ వచ్చింది. ఇండోనేషియాకు సునామీలు కొత్తేం కాదు. చిన్న చిన్న సునామీలు రెగ్యులర్‌ గా వస్తూనే ఉంటాయి. వాటి వల్ల ప్రాణ - ఆస్తి నష్టాలు ఏం సంభవించవు. కానీ డిసెంబర్‌ లో సునామీ అంటే మాత్రం వారికి ప్రాణం పోయినంత పని. ఎందుకంటే.. ఇండోనేషియాను సర్వనాశనం చేసిన సునామీలు డిసెంబర్‌ లోనే వచ్చాయి. 2004లో వచ్చిన సునామీకి అయితే.. ఇండోనేషియా సగం తుడిచిపెట్టుకుపోయింది. వేలమంది చనిపోయారు. ఇండియాలో కూడా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించాయి. అందుకే డిసెంబర్‌ అంటే చాలు ఇండోనేషియా వాసులు భయం భయంగా బిక్కు బిక్కు మంటూ బతుకుతుంటారు.


Tags:    

Similar News