అమ్మ మేన‌కోడ‌ల్ని చంపేస్తామ‌న్నారట‌!

Update: 2018-02-03 05:02 GMT
దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లిగా సుప‌రిచితురాలు దీప‌. అమ్మ బ‌తికి ఉన్న రోజుల్లో జ‌నాల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ఆమె.. అపోలో ఆసుప‌త్రిలో చికిత్స చేయించుకునే వేళ‌లో అమ్మ‌ను క‌లుసుకునేందుకు తెగ ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. అలా అంద‌రికి ప‌రిచ‌య‌మైన ఆమె.. కొద్దికాలానికే సుప‌రిచితురాలిగా మారింది.

అమ్మ వార‌సురాలిగా త‌న‌ను తాను అభివ‌ర్ణించుకునే ఆమె త‌న తీరుతో త‌ర‌చూ వార్త‌ల్లోకి వ‌స్తున్నారు. తాజాగా ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

దీప‌కు.. అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ‌కు మొద‌ట్నించి పొస‌గ‌క‌పోవ‌టం తెలిసిందే. అపోలో ఆసుప‌త్రిలో తీవ్ర అస్వ‌స్థ‌తో ఉన్న త‌న మేన‌త్త‌ను చూసేందుకు దీప‌కు అనుమ‌తిని నిరాక‌రించింది చిన్న‌మ్మే. త‌న బంధురికాన్ని మీడియాతో చెప్పుకొన్న దీప‌.. అప్ప‌ట్లో తెగ బాధ ప‌డింది కూడా.

దీప‌లో మ‌రో చిత్ర‌మైన యాంగిల్ కనిపిస్తుంటుంది. భ‌ర్త‌తో ఆమెకున్న రాజ‌కీయ వైరుధ్యం మ‌హా చిత్రంగా ఉంటుంది. ఇద్ద‌రూ ఒకే ఇంట్లో కలిసి ఉంటూ.. కాపురం చేస్తున్న‌ట్లు చెబుతూనే ఉంటారు.. రాజ‌కీయంగా త‌మ ఇద్ద‌రివి విరుద్ధ‌మైన భావాలంటూ ఎవ‌రి దారిన వారు రాజ‌కీయాలు చేయ‌టం క‌నిపిస్తుంది.

ఇదిలా ఉంటే తాను అమ్మ జ‌యంతి వేడుక‌ల్ని నిర్వ‌హించే ఏర్పాట్ల‌లో బిజీగా ఉంటే.. త‌న‌ను చంపేస్తామంటూ అన్నాడీఎంకే మాజీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ.. ఆమె ద‌గ్గ‌రి బంధువు క‌మ్ ఎమ్మెల్యే దిన‌క‌ర‌న్ లు వార్నింగ్ లు ఇస్తున్నార‌న్నారు. గ‌డిచిన కొద్దిరోజులుగా సోష‌ల్ మీడియాల ద్వారా హ‌త్యా బెదిరింపులు ఎక్కువైన‌ట్లు ఆమె పేర్కొన్నారు. త‌న‌కు వ‌స్తున్న హ‌త్యా బెదిరింపుల్లో త‌న భ‌ర్త‌కు ఎలాంటి సంబంధం లేద‌న్న ఆమె.. రాజ‌కీయంగా తామిద్ద‌రి భావాలు వేరు అయినా క‌లిసి కాపురం చేస్తున్నామని చెప్పారు. ఏమైనా దీప తీరు రోటీన్ కు భిన్నంగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News