అమ్మ మరణంతో అనివార్యమైన ఆర్కేనగర్ ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అమ్మ వారసుడ్ని డిసైడ్ చేసే ఈ ఎన్నిక ఫలితం మీద సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎన్నిక పుణ్యమా అని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించటానికి అధికారిక అన్నాడీఎంకే లోని చిన్నమ్మ వర్గం భారీగా డబ్బులు పంచే క్రమంలో ఐటీ అధికారులకు దొరికిపోవటం సంచలనం సృష్టించింది.
ముఖ్యమంత్రి పళని స్వామితో సహా పలువురు మంత్రులు కమిటీలుగా మారి.. రూ.89కోట్ల రూపాయిల్ని ఆర్కేనగర్ నియోజకవర్గ ఓటర్లకు పంచే కార్యక్రమానికి తెర తీసిన వైనం బయటకు వచ్చింది. ఐటీ అధికారులు చేసిన దాడుల్లో ఈ విషయం బయటపడటంతో ఉప ఎన్నికను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే..ఈ ఉప ఎన్నికల ప్రచార సమయంలో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అమ్మ అన్న కుమార్తె ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై కార్యదర్శి దీప.. ఆమె భర్త మాధవన్ మధ్య సంబంధాలు సరిగా లేవన్న విషయం తెలిసిందే.
మొదట్లో వీరిద్దరూ టీనగర్ లో కలిసి ఉన్నా.. తర్వాత కాలంలో వీరిద్దరూ కలిసి ఉండటం లేదు. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా దీపను వదిలి మాధవన్ విడిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో దిగిన దీప.. తన భర్త పేరును కూడా నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదు. తనకు.. తన భర్తకు సంబంధం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అయితే.. భార్య దీప మాటల్ని పెద్దగా పట్టించుకోని ఆమె భర్త మాధవన్.. దీప పిలిస్తే ప్రచారం చేయటానికి సిద్ధమని ప్రకటించారు. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఇదో సైడ్ ట్రాక్ గా చెప్పాలి. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి చోటు చేసుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదా పరిణామాల నేపథ్యంలో.. ఇంతకాలం దూరంగా ఉన్న దీప.. ఆమె భర్త మాధవన్ ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసిపోవటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నటిదాకా తనకూ.. తన భర్తకు సంబంధం లేదని చెప్పిన దీప.. ఇప్పుడు కలిసి పోయిన విషయాన్ని ప్రస్తావిస్తే.. ఇది పర్సనల్ అంటూ విషయాన్ని కట్ చేస్తున్నారు. ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా.. వీరిద్దరూ కలవటం మాత్రం దీప..ఆమెను అభిమానించే వారికి హ్యాపీ అని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/