తమిళ రాజకీయాల్లో దీప ఫ్లెక్సీల మంట

Update: 2017-01-11 06:13 GMT
ఎలాంటి అంచనాలు లేని వారు అప్పుడప్పుడు అద్భుతాలు సృష్టిస్తుంటారు. తమిళ రాజకీయాల్లో దీప వ్యవహారం ఇంచుమించు ఇదే తీరులోఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు ఆమెను అనామకురాలిగా చూసే వారుకొందరైతే.. మరికొందరు అమ్మ తర్వాత అమ్మకు సరిగ్గా సరిపోయే వ్యక్తి దీపగా అభివర్ణిస్తుంటారు. అమ్మకు మేనకోడలైన ఆమెను రాజకీయాల్లోకి రావాలంటూ ఇటీవల కాలంలో ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతోంది.

అమ్మ మరణం తర్వాత.. అన్నాడీఎంకేలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసిన దీపకు నిరాశే మిగిలింది. ఆమెను వీలైనంత దూరంగా పెట్టాలని చిన్నమ్మ డిసైడ్ కావటంతో.. అందుకు తగ్గట్లుగానే పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కారణంతోనే అపోలో ఆసుపత్రిలో అమ్మ చికిత్స పొందుతున్న వేళ సైతం దీపను అనుమతించలేదు. దీనిపై అప్పట్లో ఆమె బయటకు వచ్చి.. తానెవరన్న విషయానని వెల్లడించారు. అమ్మకు రక్తసంబంధీకులమైన తమకు ఆసుపత్రిలో ఉన్న ఆమెను చూసే హక్కు ఉంటుందని అప్పట్లో ఆమె వాదించారు. అయితే.. ఆమె వాదనకు మద్దతుగా ఏ వాయిస్ లేవలేదు.

అయితే.. అమ్మ మరణం తర్వాత సీన్ మారిపోయింది. ఆమె లేని అన్నాడీఎంకే పార్టీలో దీప కీలక బాధ్యతలు పోషించాలని అనుకున్నారు. అయితే.. పరిస్థితులు అందుకు అనువుగా లేకపోవటంతో మౌనంగా ఉన్న ఆమె.. టైం చూసుకొని రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. అయితే.. ఆమె నివాసం దగ్గరకు అన్నాడీఎంకేకు చెందిన ద్వితీయ.. తృతీయ స్థాయి నేతలు.. కార్యకర్తలు రావటం. . గుంపులు గుంపులు రావటం.. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో నాలుగైదు రోజుల్లో ఇలాంటి పరిస్థితే ఉంటుందని భావించినా.. రోజులు పెరుగుతున్న కొద్ది ఈ హడావుడి తగ్గుతుందని భావించారు.

కానీ.. అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. తనను కలవటానికి వచ్చిన సీనియర్ నేతల కాంటాక్ట్  వివరాల్ని తెలుసుకుంటూ.. ఒక రిజిష్టర్ ను ఏర్పాటు చేసిన నమోదు చేయిస్తున్నారు. కొత్త పార్టీ పెట్టాలన్న దిశగా వస్తున్న ఒత్తిళ్లకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ.. త్వరలోనే కొత్త పార్టీ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు చెబుతున్నారు. చిన్నమ్మ శశికళ పొడ గిట్టని వారు.. ఆమె వ్యతిరేకులంతా ఇప్పుడు దీప పక్షాన నిలవటం.. ఆమెను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఫ్లెక్సీల్ని భారీగా ఏర్పాటు చేస్తున్నారు.

మొదట్లో ఫ్లెక్సీల వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోని అధికారపక్షం..మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు దృష్టి సారిస్తోంది. దీప పేరిట ఏర్పాటు చేస్తున్న ప్లెక్సీల్ని తొలగిస్తూ అధికారులు కఠినంగా వ్యవహరించటంపై అన్నాడీఎంకే నేతలు.. కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో పవర్ ఉంది కాబట్టి.. దీప ఫ్లెక్సీల్ని తీయిస్తున్నారని.. రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి  దీప అని.. చేతిలోకి పవర్ వచ్చాక తిప్పలు తప్పవన్న హెచ్చరికలు చేస్తుండటం కనిపిస్తోంది. ఈ పరిణామాలు అధికారపక్షంలో కొత్త వేడిని పుట్టిస్తున్నాయి. ద్వితీయశ్రేణి నేతలు.. కార్యకర్తలు దీపను అమితంగా ఆరాధిస్తున్నా.. ఎంపీలు.. మ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు మాత్రం ఆ ఊసే ఎత్తటం లేదు. దీంతో.. దీప వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా దీప ఫ్లెక్సీల్ని తొలగిస్తున్న వైనం అన్నాడీఎంకేలో కొత్త రచ్చగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News