తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుటుంబ సభ్యుల్లో మరో చీలిక వచ్చింది. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ భర్త కె. మాధవన్ కొత్త పార్టీని ప్రారంభించి అందరినీ ఆశ్చర్య పరిచారు. సఎంజీఆర్ అమ్మ దీపా ఫోరమ్' పేరుతో దీపా కుమార్ రెండు నెలల క్రితం పార్టీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ వ్యవహారాల్లో మాధవన్ కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా ఆయన సొంత పార్టీని స్థాపించడం గమనార్హం. అధికార - ప్రతిపక్షాలకు సంబంధించిన పేర్లు వచ్చేలా ఆ పార్టీకి సఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట కజగం(ఎంజెడిఎంకె)' పేరు పెట్టడం మరో విశేషం.
కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం మాధవన్ మాట్లాడుతూ అమ్మ నిజమైన అభిమానుల మద్దతు తనకు ఉందని చెప్పుకొచ్చారు. తన భార్య దీపా పార్టీలో చేరితో ఆమెకు కీలక పదవి ఇస్తానని పార్టీ జెండా ఈ సందర్భంగా మాధవన్ వ్యాఖ్యానించారు. దీపా పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో తాను కీలక పాత్ర పోషించిన విషయం నిజమేనని తెలిపిన మాధవన్ ఆ పార్టీ చెడు శక్తుల ఆధిపత్యం ఎక్కువైపోయిందని ఆరోపించారు. అనంతరం పలు కారణాలతో పార్టీని వీడినట్లు తెలిపారు, కాగా, పార్టీలోని కీలక పదవుల నియామకంలో దీపాపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/