వావ్ అనిపించేలా ఢిల్లీ ఎయిర్ పోర్టు.. ప్రపంచలోనే 10 ప్లేస్

Update: 2022-10-28 04:23 GMT
మరో ఘనతను సొంతం చేసుకుంది ఢిల్లీ ఎయిర్ పోర్టు. జీఎంఆర్ గ్రూప్ నిర్వహణలో ఉన్న ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్టులో ఒకటిగా నిలిచింది.

టాప్ 10 బిజీగా ఉండే ఎయిర్ పోర్టులో ఢిల్లీ విమానాశ్రయంగా పదో ప్లేస్ లో నిలిచింది. కొవిడ్ కు ముందు ఢిల్లీ ఎయిర్ పోర్టు 14 ప్లేస్ లో ఉంటే.. తాజాగా నాలుగు స్థానాలు మెరుగుపడి.. పదో స్థానానికి చేరుకుంది.

అక్టోబరులో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి జరిపిన రాకపోకలు.. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా చూసినప్పుడు తాజా ఘనతను సాధించినట్లు చెబుతున్నారు. అక్టోబరు నెల ముగియటానికి మరో రెండు రోజులు ఉన్నందున.. అది కూడా పూర్తి అయితే రికార్డు మరింత మెరుగు పడినా ఆశ్చర్యం లేదంటున్నారు.

ఒక ఎయిర్ పోర్టు నుంచి విమానాలు రాకపోకలు జరిపిన సంఖ్య.. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఓఎజీ అనే సంస్థ ర్యాంకుల్ని లెక్క కడుతుంది.

అమెరికాలోని అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్డుగా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో దుబాయ్.. టోక్యోలోని హనెడా ఎయిర్ పోర్టులు.. రెండు.. మూడు స్థానాల్లో నిలిచాయి.

ముంబయి - దుబాయ్.. ఢిల్లీ దుబాయ్ విమాన మార్గాలు ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉంటే టాప్ 10 విమాన మార్గాల్లో ఒకటిగా నిలిచినట్లు చెబుతున్నారు. మొత్తంగా.. కరోనా తర్వాత పరిస్థితులు సాధారణంగా మారుతున్నాయనటానికి తాజా ర్యాంకింగ్ స్పష్టం చేస్తుందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News