వైరస్ విషయంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుండగా.. స్వదేశంలో రాష్ర్టాలు కూడా పోటీ పడుతున్నాయి. ఇక దేశంలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 11,458 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 3 లక్షల మార్క్ దాటింది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్యపరంగా నాలుగో స్థానంలో ఉన్న భారత్ రోజువారీ కేసుల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక కేసులతో పాటు మరణాల్లోనూ భారత్ టాప్ లో ఉంటోంది.
మహారాష్ట్రలో 127 మరణాలు సంభవించగా ఢిల్లీలో 129 నమోదయ్యాయి. మరణాల విషయంలో మహారాష్ట్రను ఢిల్లీ దాటేసింది. జూన్ 1 నుంచి మహారాష్ట్రలో మరణాలు 62శాతం పెరగ్గా, ఢిల్లీలో 156శాతం పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 17 రాష్ట్రాల్లో 386 మరణాలు సంభవించగా అందులో 66శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి.
గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడుల్లోనూ రోజువారీ మరణాలు భారీగా ఉంటున్నాయి. తాజా వివరాల ప్రకారం మహారాష్ట్రలో కేసులు 1.01 లక్షలకు చేరాయి. మహారాష్ట్రలో రోజువారీ కేసులు వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైగా నమోదు కాగా, ఢిల్లీలో తొలిసారి రెండు వేల మార్కు దాటింది.
దేశంలో ఇప్పటివరకు వైరస్ తో మరణించినవారి సంఖ్య 9,195కు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 11,929 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆదివారం(జూన్ 14,2020) ఉదయానికి దేశంలో కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,20,922కు చేరిందని ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 1,62,379మంది కోలుకోగా 1,49,348 మంది చికిత్స పొందుతున్నారు.
దేశంలో పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచంలో భారత పరిస్థితి ఇలా ఉంది. మరణాల్లో భారత్ ప్రపంచంలో 9వ స్థానంలో కొనసాగుతోంది. 9,650 మరణాలతో బెల్జియం 8వ స్థానంలో ఉండగా, 8,867 మరణాలతో జర్మనీ 10వ స్థానంలో ఉంది. ఇక కేసుల్లో భారత్ నాలుగో స్థానంలో ఉండగా అమెరికా, బ్రెజిల్, రష్యా మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.