ప్రముఖ జర్నలిస్ట్ - రిపబ్లిక్ చానల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై దొంగతనం కేసు నమోదైంది! ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు గురువారం లీగల్ నోటీసు జారీచేసింది. ఉద్యోగ నిబంధనను ఉల్లంఘించారని, టైమ్స్ నౌకు చెందిన మేధో సంపదను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ధర్మాసనం తాఖీదులు ఇచ్చింది. అది కూడా మరో మీడియా సంస్థ, అందులోనూ అర్నబ్ పనిచేసిన తాజా మాజీ సంస్థ కావాడం విశేషం.
బెన్నెట్ కోల్ మన్ కంపెనీ లిమిటెడ్ (బీసీసీఎల్)కు చెందిన టైమ్స్ నౌ చానల్ లో అర్నబ్ గతంలో చీఫ్ ఎడిటర్ గా పనిచేశారు. బీసీసీఎల్ ఇటీవల అర్నబ్ పై క్రిమినల్ కేసు పెట్టింది. అర్నబ్, ప్రేమా శ్రీదేవి టైమ్స్ నౌలో ఉద్యోగులుగా ఉన్నప్పుడు సునంద పుష్కర్, లాలూప్రసాద్ యాదవ్ లపై రికార్డు చేసిన రెండు వార్తా కథనాలకు సంబంధించిన ఆడియో టేప్ లను ఇటీవల రిపబ్లిక్ చానల్ లో ప్రసారం కావడంపై బీసీసీఎల్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. రిపబ్లిక్ చానల్ లో ఆ వార్తా కథనాలను ప్రసారం చేసినప్పుడే తమకు మేధో సంపద చోరీ గురించి తెలిసిందని టైమ్స్ నౌ సీఈవో ఎంకే ఆనంద్ తెలిపారు. ఆ స్థాయి మనిషి టైమ్స్ నౌ నుంచి దొంగిలించిన సమాచారాన్ని తన చానల్ లో ప్రసారం చేసుకోవడం దారుణమని అన్నారు. చానల్ ప్రారంభం తొలి మూడు రోజుల్లో ఈ స్టోరీలను ప్రసారం చేయడాన్ని బట్టి ఇది కచ్చితంగా ముందస్తు ప్రణాళిక అని పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో టైమ్స్ నౌ నుంచి బయటకొచ్చిన అర్నబ్ ఇటీవల రిపబ్లిక్ చానల్ ను ప్రారంభించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/