హిందూ దేవ‌త‌ల‌పై అభ్యంత‌రక‌ర పోస్టులు తొల‌గించాల్సిందే : ఢిల్లీ హైకోర్టు

Update: 2021-10-30 11:57 GMT
ట్విట్ట‌ర్‌ లో హిందూ దేవ‌త‌ల‌పై అభ్యంత‌రక‌రంగా ఉన్న పోస్టుల‌ను తొల‌గించాల‌ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సోష‌ల్ మీడియాలోని అతిపెద్ద స‌మూహంతో వ్యాపారం చేస్తున్న‌ప్పుడు సాధార‌ణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను కూడా ప‌ట్టించుకోవాల్సి ఉంటుంద‌ని ట్విట్ట‌ర్‌ కు హిత‌వు ప‌లికింది. వినియోగ‌దారుల సెంటిమెంట్ల‌ను క‌చ్చితంగా ప‌రిగ‌ణ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించింది. అభ్యంతరకర కంటెంట్‌ ని తొలగిస్తారా లేదా అని ట్విట్ట‌ర్ త‌ర‌పున హాజ‌రైన ప్రతినిధిని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. త‌మ ఆదేశాల‌తో గ‌తంలో రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్‌ లోని కంటెంట్‌ ను తొల‌గించిన విషయాన్ని గుర్తు చేసిన ఢిల్లీ హైకోర్టు. ఈవిష‌యంలోనూ అదే ప‌నిచేయాల‌ని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ జ్యోతిసింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేర‌కు తీర్పునిచ్చింది. నాస్తిక రిపబ్లిక్ అనే అకౌంట్‌ లో ఇటీవ‌ల దాని యాజూర్లు.. కాళికా దేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు, చిత్రాలు పోస్ట్ చేశారు. దీనిపై ఆదిత్య సింగ్ దేశ్వాల్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అభ్యంత‌క‌ర సందేశంపై తాను ఫిర్యాదు చేసినా ట్విట్ట‌ర్ ప‌ట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2021ని ట్విట్ట‌ర్ ఉల్లంఘించింద‌ని విచార‌ణ సంద‌ర్భంగా తెలిపారు.

విచార‌ణ సంద‌ర్భంగా ఢిల్లీ హైకోర్టు అలాంటి కంటెంట్‌ ను తొల‌గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పింది. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే ట్వీట్లను ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. ట్విటర్ తరపున విచార‌ణ‌కు హాజ‌రైన సీనియ‌ర్ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని స్ప‌ష్టం చేశారు. కేసు తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది
Tags:    

Similar News