బాబోయ్‌..చలాన్ల దెబ్బ‌తో న‌డిరోడ్డుపై బైకే త‌గ‌ల‌బెట్టేశాడు !

Update: 2019-09-06 09:59 GMT
ర‌హ‌దారి భ‌ద్ర‌త‌, ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన కొత్త ట్రాఫిక్ చ‌ట్టం ప్ర‌జ‌ల‌కు మంట పుట్టిస్తోంది. ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు ఈ చ‌ట్టాన్ని అడాప్ట్ చేసుకోక‌పోయినా - దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్ర‌జ‌ల‌పై త‌మ ప్ర‌తాపం చూపి స్తున్నారు. ప్ర‌స్తుతం ఈ నెల 1 నుంచి ఈ కొత్త చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. చ‌లానాల భారం భారీ ఎత్తున పెరిగింది. దీంతో వాహ‌న‌దారులు త‌మ కోపాన్ని అణుచుకోలేక అక్క‌డిక‌క్క‌డే ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో ప‌లు విష‌యాలు సంచ‌ల‌నాలై దేశాన్ని చుట్టుముడుతున్నాయి.

ఒడిసాలోని భువ‌నేశ్వ‌ర్‌ లో ఓ బైక్ య‌జమానికి 23 వేల చ‌లాన్ రాశారు పోలీసులు. దీంతో ఆయ‌న అసలు బైక్ అమ్మితేనే 15 వేలు వ‌స్తుంద‌ని - అలాంటి దానికి 23 వేల ఫైన్ ఎందుకు క‌ట్టాల‌ని పేర్కొంటూ ఆ బైక్‌ ను పోలీసుల‌కు హ్యాండోవ‌ర్ చేసి వెళ్లిపోయారు. అదేవిధంగా రాజస్థాన్‌ లో ట్రాక్టర్ డ్రైవర్‌ కి... రూ.23 వేల ఫైన్... ఒడిసాలో ఆటో డ్రైవర్‌ కి రూ.47,500 ఫైన్... వేయ‌డంతో వారు కూడా తీవ్ర‌స్థాయిలో కేంద్రంపై తిట్టిపోశారు.  ఈ రెండు ఘటనలూ... దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌లో చిర్రెత్తిన బైక్ య‌జ‌మాని.. ఏకంగా త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తూ.. బైక్‌ కు నిప్పు పెట్టేశారు.

ఢిల్లీలోని... షేక్ సరాయ్ ఏరియాకు చెందిన ఓ బైక‌ర్‌ ను పోలీసులు ఆపారు. ఆయ‌న వాహ‌న ప‌త్రాలు - ఆయ‌న లైసెన్స్ త‌నిఖీ చేసి ఏదో లోపాన్ని ఎత్తి చూపుతూ.. 3900 ఫైన్ రాశారు. దీంతో చిర్రెత్తుకు వ‌చ్చిన స‌ద‌రు య‌జ‌మాని.. వెంట‌నే తాను సిగ‌రెట్ వెలిగించుకునేందుకు వాడే లైట‌ర్‌ ను తీసి వెలిగించి బైక్ పెట్రోల్ ట్యాంక్‌ లోకి విసిరాడు. అంతే... బండి ఒక్కసారిగా తగలబడింది. క్షణాల్లో బండి మొత్తం మంటలు అంటుకున్నాయి. అలర్టైన పోలీసులు... వెంటనే వాటర్‌ వేసి... మంటల్ని అదుపులోకి తెచ్చారు. మ‌రి ఇంత‌గా ఈ కొత్త చ‌ట్టంపై ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నా..కేంద్రంలోని పాల‌కులు మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.


Full View
Tags:    

Similar News