అంద‌మైన భార్య‌ను అలా చేయ‌బోయిన భ‌ర్త‌!

Update: 2018-08-12 04:30 GMT
భార్య అందంగా ఉంటే మురిసిపోతారు. న‌లుగురు చూసి మెచ్చుకుంటే గ‌ర్వ‌ప‌డ‌తాడు ఏ భ‌ర్త అయినా. త‌న అదృష్టానికి ఉబ్బిత‌బ్బుబ్బిపోతాడు. కానీ.. ఏ భ‌ర్తా చేయ‌ని దుర్మార్గపు ప‌ని చేసిన అత‌గాడి పని ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇరుగుపొరుగూ త‌న భార్య‌ను చూస్తున్నార‌ని.. అందంగా ఉంద‌ని పొగుడుతున్న వైనాన్ని ఆ భ‌ర్త స‌హించ‌లేక‌పోయాడు. ఎవ‌రికి రాని దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ను చేశాడా భ‌ర్త‌.

ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ దుర్మార్గం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి హాట్ టాపిక్ గా మారింది. అందంగా ఉన్న త‌న భార్య‌ను అంద‌రూ అదే ప‌నిగా చూస్తున్నార‌ని అసూయ‌తో ర‌గిలిపోయిన ఢిల్లీకి చెందిన స‌ద్దాం.. త‌న భార్య‌ను చంపేయాల‌నుకున్నాడు. అయితే.. అంత‌లోనే మ‌న‌సు మార్చుకున్నాడు.

చంపే ప్లాన్ ను ప‌క్క‌న పెట్టి.. త‌న భార్య‌ను ఏ వ్య‌భిచార గృహానికో అమ్మేస్తే.. మంచిగా గిట్టుబాటు అవుతుంద‌ని ఆశించాడు. అంతే.. ముష్టి ప్లాన్ వేశాడు. పుట్టింటికి తీసుకెళ‌తాన‌ని చెప్పి భార్య‌ను సిద్ధం చేశాడు. అత‌గాడి మాట‌ల్ని నిజ‌మేన‌ని న‌మ్మిన ఆమెను తీసుకొని.. వ్య‌భిచార గృహానికి చెందిన ఒక బ్రోక‌ర్ కు అప్ప‌గించాడు.

అయితే.. ఆ బ్రోక‌ర్ మ‌ఫ్టీలో ఉన్న పోలీసులు. వెంట‌నే.. భ‌ర్త‌ను అదుపులోకి తీసుకొని జైలుకు త‌ర‌లించారు. ఊహించ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించిన భ‌ర్త నిర్వాకం గురించి తెలుసుకున్న భార్య స‌మీరా (28) షాక్ తింది. త‌న ప‌ట్ల భ‌ర్త ఆలోచ‌న‌ను ఆమె జీర్ణించుకోలేక‌పోతోంది. ప్ర‌స్తుతం ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.


Tags:    

Similar News