పాక్‌ నటికి మైండ్ బ్లాక్ కౌంటర్ ఇచ్చిన ఢిల్లీ పోలీస్‌

Update: 2023-05-10 16:35 GMT
మన పక్క దేశం పాకిస్తాన్‌ ఎంతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయినా.. అక్కడి పాలకులు ఎంతగా విద్వంసాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తూ ఉన్నా కూడా నోరు తెరవని స్థానిక ప్రజలు మరియు స్థానిక సెలబ్రిటీలు మాత్రం పదే పదే పక్క దేశాల గురించి మాట్లాడుతూ వివాదాన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు నడనం లో సందేహం లేదు.

పాకిస్తాన్‌ క్రికెటర్స్ మరియు ఫిల్మ్‌ సెలబ్రెటీలు ఎక్కువ శాతం మంది ఇండియా గురించి శత్ర దేశంగా చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే తాజాగా పాకిస్తాన్ నటి సెహర్ షన్వారీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె ట్వీట్‌ కు ఢిల్లీ పోలీసులు కౌంటర్ ఇచ్చారు.

నటి సెహర్‌ షన్వారీ ట్విట్టర్‌ లో... ఢిల్లీ పోలీసులకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే ఇవ్వండి. మా దేశంలో వారి ప్రధాని మరియు రా ఏజెంట్స్ చేస్తున్న అక్రమాలకు సంబంధించి ఫిర్యాదు ఇవ్వల్సి ఉందంటూ పేర్కొంది. ఆమె ట్వీట్ ను ఇండియన్స్ చాలా మంది తప్పుబట్టారు.

ఆ విషయమై ఢిల్లీ పోలీసులు అదే సోషల్‌ మీడియా ద్వారా స్పందించి పాక్‌ నటికి  కౌంటర్‌ ఇచ్చారు. పాక్ లో మాకు అధికార పరిధి లేదు... కనుక ఇక్కడి పోలీసులు ఏమీ చేయలేరు. మీ దేశంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడం జరిగిందని సమాచారం. ఈ ట్వీట్ ఎలా చేశారో తెలుసుకోవాలని ఉంది అంటూ పోలీసులు కౌంటర్ గా ట్వీట్‌ ని చేశారు.

Similar News