అత్యాచార కేసు మాఫీ చేస్తానంటూ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయింది ఓ లేడీ ఎస్ ఐ. లైంగికదాడి కేసు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అహ్మదాబాద్ పశ్చిమ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శ్వేతా జడేజా రూ. 35 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీసులు ఆమెపై ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కింద కేసు నమోదు చేశారు. దీని తో భాదితులకు అండగా ఉండాల్సిన ఈమె డబ్బు మీద ఉన్న వ్యామోహం తో ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తోంది .
పూర్తి వివరాలు చూస్తే ... అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే ఇద్దరు మహిళలు తమపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనాల్ షా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసు నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. కాగా, ఇటీవల ఈ కేసు విచారణ అహ్మదాబాద్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తోన్న శ్వేతా జడేజాకు అప్పగించారు. కేసు విచారణ ప్రారంభించిన శ్వేత.. నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేశారు.
డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిందితుడి సోదరుడు భావేష్ ను హెచ్చరించారు. భావేష్ ఓ మధ్యవర్తి ద్వారా 20లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని, అ మొత్తాన్ని అప్పజెప్పాడు. రూ. 20 లక్షలు లంచం తీసుకున్న లేడీ ఎస్ శ్వేతా జడేజా వారం రోజుల పాటు సైలెంట్ గా ఉండిపోయింది. తరువాత మళ్లీ నిందితుడి సోదరుడు భూపేష్ ను పిలిచి తనకు రూ. 20 లక్షలు సరి పోదని, మిగిలిన రూ. 15 లక్షలు ఇస్తేనే మీ సోదరుడి ని అత్యాచారం కేసు నుంచి తప్పిస్తానని బెదిరించింది.
రూ. 15 లక్షలు ఇవ్వాలని లేడీ ఎస్ఐ శ్వేతా జడేజా టార్చర్ ఎక్కువ చెయ్యడంతో నిందితుడి సోదరుడు భూపేష్ అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించి విషయం మొత్తం చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరి లో ఫిర్యాదు రాగా, విచారణ చేసి శుక్రవారం శ్వేత ను అరెస్ట్ చేశారు . రూ.20 లక్షల లంచం తీసుకుని, మరో 15లక్షలు డిమాండ్ చేసినట్లు ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేశారు. శనివారం ఆమె ను సెషన్స్ కోర్టు హాజరు పర్చ గా, కోర్టు 3 రోజుల రిమాండ్ ను విధించింది.