మోడీపై ప్రముఖ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు

Update: 2017-02-07 09:09 GMT
రోజులు గడుస్తున్న కొద్దీ ప్రధాని నరేంద్ర మోడీ అంతకంతకూ బలపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్ననిర్ణయాలతో ఆయన ఇమేజ్ భారీగా పెరగుతుందన్న విషయాన్ని ఇటీవల జరిపిన సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. మోడీ నిర్ణయాలపై ప్రముఖులు పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడా జాబితాలోకి అమెరికా ఆర్థికవేత్త స్టీవ్ హెచ్ హంకీ చేరారు.

తాజాగా ప్రధాని మోడీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా మండిపడటమే కాదు.. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకోవటం మోడీ చేతకానితనంగా అభివర్ణించారు. పెద్దనోట్లను రద్దు చేసేంతగా భారత్ లో మౌలిక సదుపాయాలు లేవన్న ఆయన.. ఈ వ్యవహారం మొదట్నించి గందరగోళంగా ఉన్నట్లుగా ట్వీట్లు చేశారు.

భారతదేశం ఎటు పోతుందో ఎవరికీ తెలీదని.. ఇక ప్రధాని మోడీకి అయితే.. అసలే తెలీదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన ఆయన.. నోట్ల రద్దు వ్యవహారం పెద్ద గందరగోళ వ్యవహారంగా అభివర్ణించారు. ఓపక్క దేశీయంగా మోడీ ఇమేజ్ రోజురోజుకీ పెరుగుతుంటే.. అందుకు విరుద్ధంగా అంతర్జాతీయంగా మోడీ తీరుపై విమర్శలు సంధించేవారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News