కాశ్మీర్ లోయలో దారుణ రక్తపాతానికి కారణమైన ఉగ్రవాద గ్రూపుల్లో అత్యంత బలమైన.. శక్తివంతమైన లష్కరే టాప్ కమాండర్ అబూ దుజానా ఎన్ కౌంటర్లో హతం కావటం తెలిసిందే. అతడ్ని అదుపులోకి తీసుకొని.. రక్తపాతాన్ని నిలువరించేందుకు అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
అతడికి సంబంధించిన పక్కా సమాచారాన్ని సేకరించిన అధికారులు.. అతడు ఉన్న ఇంటిని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా దుజానాను ప్రాణాలతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అతడితో అధికారులు ఫోన్లో మాట్లాడారు. బాయినెట్ అంచుల్లో ఉన్న వేళ.. అబూదుజానా అధికారులతో ఎలా మాట్లాడాడు.. ఏం మాట్లాడాడు? అన్న ప్రశ్నలకు సమాధానంగా ఒక ఆడియో విడుదలైంది.
ప్రాణాలు విడిచేందుకు సైతం సిద్ధమే కానీ.. లొంగిపోయే ప్రసక్తే లేదన్నట్లుగా మాట్లాడటంతో పాటు.. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల విషయంలో అతగాడి తీరు చూస్తే.. ఉగ్రవాదం అతడి తలకు ఎంతలా ఎక్కేసిందన్న విషయం అర్థమవుతుంది. బయటకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్ చూస్తే..
దుజానా: ఎలా ఉన్నారు?
అధికారి: నా సంగతి వదిలేయ్. నువ్వు ఎందుకు లొంగిపోవు?
దుజానా: ప‌్రాణాలు వదిలేందుకే ఇంటిని వదిలి వచ్చా. ఇవాళ కాకున్నా రేపు అయినా ప్రాణాలు పోవాల్సిందే
అధికారి: కుటుంబం గురించి ఆలోచించు?
దుజానా: నేను ఇంటి నుంచి బయటకొచ్చిన రోజే వాళ్లంతా చనిపోయారు
అధికారి: కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉందో తెలుసు.. ఇదంతా ఆటలో భాగంగానే జరుగుతోంది. లొంగిపో..
దుజానా: వ్యవస్థ గురించి.. కాశ్మీర్ పరిస్థితుల గురించి బాగా తెలుసు. ఎవరైనా ఆటలు ఆడాలంటే ఏం చేయగలను? ఇంకేంటి విశేషాలు? మీరెలా ఉన్నారు?
అధికారి: మేం బాగానే ఉన్నాం. అయినా.. దీనికి ఇప్పుడు సరైన సమయం కాదు
దుజానా: నవ్వేస్తూ.. కొన్నిసార్లు మీరు మాకంటే ముందు ఉంటారు. కొన్నిసార్లు మేం ముందు ఉంటాం. ఏమైతేనేం చివరకు పట్టుకున్నా.. మీకు శుభాకాంక్షలు
అధికారి: మేం ఎవరిని చంపాలనుకోవటం లేదు
దుజానా: మీకు సమాచారం ఇచ్చిన వ్యక్తి మేం చనిపోవాలని అనుకుంటున్నాడు కదా
అధికారి: ఇది జిహాద్ కాదు.. అది మీకు కూడా తెలుసు
దుజానా: ఇప్పుడేం చేయలేం
అధికారి: అయితే.. లొంగిపోండి. మీరు ఇతరులకు అర్థమయ్యేలా చెప్పండి. కాశ్మీర్ రక్తపాతాన్ని ఆపగలరు
దుజానా: కాశ్మీర్ లో రక్తపాతానికి నేను కారణం కాదు. అది ప్రజలకు తెలుసు
అధికారి: లష్కరేలో నువ్వే కీలకమైన కమాండర్ వి. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది.
దుజానా: సరే చూస్తా అంటూ కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించాడు
Full View