ఐఏఎస్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన డిటెక్టివ్‌

Update: 2017-11-04 08:12 GMT
ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్లో కొన్ని శాఖ‌ల్లో సాధార‌ణం అయిపోయిన అవినీతిని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించుకోవాల‌ని భావించి...గూడ‌చ‌ర్యం చేయాల్సిన ఓ డిటెక్టివ్ అంత‌కుమించి అతి చేసి ఏకంగా బ్లాక్‌మెయిల్‌కు పాల్ప‌డి... పోలీసుల‌కు దొరికిపోయాడు. ఇది మహారాష్ట్రలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌.. దీంతో ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను బెదిరించిన కేసులో థానే పోలీసులు స‌ద‌రు డిటెక్టివ్ స‌హా ఆయ‌న భార్య‌ను కూడా అరెస్టు చేశారు.

మ‌హారాష్ట్ర రోడ్డు రవాణ సంస్థలో వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధాకారి రాదేశ్యామ్‌ను ఇటీవల ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సస్పెండ్ చేశారు. సెక్రటేరియేట్‌లో పనులు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిందే అని రాదేశ్యామ్ ఫోన్‌లో ఇతరులతో మాట్లాడాడు. ఆ ఫోన్ సంభాషణలను ప్రైవేటు డిటెక్టివ్‌గా పనిచేస్తున్న సతీష్ మంగల్ రికార్డు చేశారు.ఈ రికార్డుల ఆధారంగా ప్రైవేటు డిటెక్టివ్ సతీష్ మంగల్.. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్‌ను బెదిరించడం మొదలుపెట్టాడు. 10 కోట్లు ఇస్తే, తన దగ్గర ఉన్న ఆధారాలను బయటపెట్టను అని మంగల్ ఆ ఐఏఎస్ ఆఫీసర్‌కు తెలిపాడు. ఒకవేళ అడిగిన డబ్బులు ఇవ్వకుంటే.. అతనితో పాటు ఆయన కూతుర్ని కూడా చంపేస్తామని బెదిరించారు.  ఇందులో త‌న భార్య‌ శ్రద్ధతో పాటుగా ఓ స్నేహితుడి కూడా క‌లుపుకున్నాడు.

ఎట్ట‌కేల‌కు ఐఏఎస్ ఆఫీసర్ రాదేశ్యామ్ మోపల్వార్‌కు, ప్రైవేట్ డిటెక్టివ్‌కు మధ్య 7 కోట్లకు అంగీకారం కుదిరింది. అయితే ఈ డ‌బ్బుల కోసం పదేపదే బెదిరింపులకు దిగిన డిటెక్టివ్ మంగల్‌ను సస్పెన్షన్‌కు గురైన ఐఏఎస్ ఆఫీసర్ పోలీసులకు పట్టించాడు. డిటెక్టివ్ మంగల్‌తో పాటు ఆయన భార్యను ఈ కేసులో అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, 5 మొబైళ్లు, 4 పెన్‌డ్రైవ్‌లు, 15 సీడీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మారువేషంలో ఓ కానిస్టేబుల్ కోటి రూపాయలతో డిటెక్టివ్ ఇంటికి వెళ్లి అతన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు. 
Tags:    

Similar News