వైసీపీ ఈసారి కొత్త రాజకీయం చేయాలనుకుంటోంది. కొత్త అంటే మరేమీ లేదు. సీనియర్ మంత్రులను ఎమ్మెల్యేలను ఎంచి మరీ ఢిల్లీ బాట పట్టించడం. ఆ జాబితాలో చూసుకుంటే ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి మొదటి పేరుగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారని అంటున్నారు. ఆయన మొత్తం రాజకీయ జీవితంలో ఎపుడూ ఎంపీగా పోటీ చేయలేదు. అసెంబ్లీయే ముద్దు అంటూ వస్తున్నారు.
నిజానికి 2019 ఎన్నికలలో సైతం ఆయన్ని శ్రీకాకుళం నుంచి ఎంపీగా దిగాలని జగన్ కోరినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆయన నో చెప్పేశారు. మంత్రిగా మరోమారు చేయాలన్న కోరిక వల్లనే నాడు కాదన్నారు అని వినిపించింది. ఇపుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది. జగన్ క్యాబినేట్ లో రెవిన్యూ వంటి కీలకమైన శాఖను ఆయన చూస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ మీద కూడా తర్జన భర్జన పడుతున్నారు. తన కుమారుడిని రంగంలోకి దించి తాను రిటైర్మెంట్ కావాలనుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం ధర్మానను వదిలేట్టు లేరనే అంటున్నారు. అయితే ఈసారి ధర్మానకు ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం ఎంపీ సీటుని గెలవడం వైసీపీకి గట్టి టార్గెట్ గా ఉంది.
ఆ సీట్లో పాతుకుపోయిన కింజరాపు ఫ్యామిలీని ఓడించాలని కూడా పంతం పట్టి ఉంది వైసీపీ, ఇప్పటికే టెక్కలిలో అచ్చెన్నాయుడు మీద దువ్వాడ శ్రీనివాస్ ని రెడీ చేసి పెట్టిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మీద ధర్మాన ప్రసాదరావు అయితే కరెక్ట్ గా ఉంటారని అంచనా కడుతోంది. మొత్తం జిల్లా మీద పట్టు ఉన్న ధర్మాన క్యాండిడేట్ అయితే వైసీపీకి మంచి విజయం లభిస్తుందని కూడా ఊహిస్తోంది.
ఈ నెపధ్యంలో ధర్మాన మీద వత్తిడి పెరుగుతోందిట. అయితే ఎంపీగా పోటీ చేయడానికి ధర్మాన విముఖంగా ఉన్నారని అంటున్నారు. తాను అసెంబ్లీకే నో అంటూంటే ఈ ఎంపీ గొడవ ఏంటి అన్నది కూడా పెద్దాయన ఆలోచనగా ఉందిట. దీని వెనక మరో కారణం ఉందని అంటున్నారు. కింజరాపు ఫ్యామిలీతో ధర్మాన ఫ్యామిలీకి రాజకీయ వైరం కూడా గట్టిగా లేదని అంటారు. ఈ రెండు కుటుంబాలు లోపాయికారీగా సహకరించుకుంటాయని చెబుతారు.
అందుకే ఆ సీటులో ఎపుడూ వైసీపీ గెలవడం లేదని, గతంలో కూడా కాంగ్రెస్ పెద్దగా గెలిచిన దాఖలాలు లేవని ఉదహరిస్తున్నారు. ఈ విషయాలు అన్నీ పూర్తిగా తెలుసుకున్న మీదటనే జగన్ పట్టుబట్టి మరీ ధర్మాననే బరిలోకి దిగమంటున్నారని టాక్. అంటే ఢీ అంటే ఢీ అని రెండు కుటుంబాలు దిగితేనే సరైన రిజల్ట్ వస్తుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారుట.
కానీ ధర్మాన ప్రసాదరావుని ఒప్పించడం కష్టమే అని అంటున్నారు. అయితే ఒక షరతు మాత్రం ఆయన ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తన కుమారుడికి శ్రీకాకుళం అసెంబ్లీ సీటు ఇస్తే తాను ఎంపీగా పోటీకి రెడీ అని ఆయన చెప్పవచ్చు అంటున్నారు. మరి ఒకే కుటుంబానికి మూడు టికెట్లు జగన్ ఇస్తారా అనందే చూడాలి. ఇప్పటికే ధర్మాన క్రిష్ణ దాస్ కి కూడా టికెట్ ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి ధర్మాన ప్రసాదరావు రాజకీయం ఏంటో ఆయన అనుచరులకే అర్థం కాకుండా ఉందిట. జగన్ నుంచి వత్తిడి వచ్చినా నో చెబితే మరి ఎలా ఉంటుందో కూడా చూడాలని అంటున్నారు.