ఆయన సహనానికి మారు పేరు అని చెబుతారు. మృదు భాషిగా, చిరు దరహాసిగా కూడా అంటూంటారు. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా రెవిన్యూ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు. ఆయన ఇంటి పేరులోనే ధర్మం ఉంది. ఆయన వైఖరి కూడా అలాగే ఉంటుంది. ఆయన మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎవరినీ తూలనాడి ఎరగరు.
అనవసరమైన వివాదాల జోలికి పోరు. ఆయన పేరు కూడా ఎక్కడ అలా కనిపించదు, వినిపించదు. అలాంటి ధర్మాన మంత్రిగా అయ్యాక తాను కోరుకున్న అందలం దక్కాక బహు ఖుషీగా ఉండాలి. కానీ ఆయన మాటలేమో వేదాంతం పలికిస్తూంటే చేతలేమో చెంపలను తాకుతున్నాయి.
ధర్మాన ఇన్నేళ్ళ జీవితంలో చూడని ఘటన అయితే ఒకటి అలా జరిగింది. ఆయన మంత్రిగా తొలిసారి జిల్లాకు వస్తున్నారు కదా అని క్యాడర్ తో పాటు అభిమానులంతా ఆయన కోసం జిల్లాలో ఘనస్వాగతాలు పలికారు. అదే టైమ్ లో చాలా మంది కరచాలనానికి కూడా ఉబలాటపడ్డారు.
ఇక ధర్మాన సైతం వచ్చిన వారికి వచ్చినట్లే షేక్ హ్యాండ్స్ ఇస్తూ చేతులను నొప్పి పుట్టించుకున్నారు. అయితే ఒక అభిమాని కమ్ కార్యకర్త మాత్రం ఆయన చేతిని పట్టుకుని లాగేశాడు. దాంతో మరి మంత్రి గారికి చిర్రెత్తుకొచ్చిందో ఏమో తెలియదు కానీ ఒక్కటిచ్చుకున్నారు. అంతే అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.
అభిమానులు సైతం హడలిపోయేలా మంత్రి గారు ధర్మాగ్రహం ప్రదర్శించారు అని అంతా చెవులు కొరుక్కున్నారు. ఎంత అయినా వారికి పెద్దాయన. నాయకుడు. ప్రేమగా చూసుకునేవారు. అందుకే చేయి చెంపను తాగికా అంతా అభిమానమే అనుకునే నిండు మనసు వారిది. సరే మంత్రి గారు మాత్రం కొట్టాలని కొడతారా ఏంటి. అందుకే మళ్ళీ కొంత సేపటి తరువాత అంతా ఈలలు, గోలలతో మంత్రి చుట్టూ సందడి కనిపించింది.
అయితే ఈ సంఘటన మాత్రం వీడియోలో బంధీ అయిపోయింది. ఇపుడు ఇదే షాట్ ఒకటిని నాలుగు సార్లు టీవీల్లో వేస్తూంటే ధర్మాన గురించి విన్న వారు కన్న వారూ నివ్వెరపోతున్నారు. అయినా ఈ రోజుల్లో ఆ మాత్రం దూకుడు ఉండకపోతే కార్యకర్త కూడా చేయి పట్టుకుని లాగేయడూ. మొత్తానికి మంత్రి గారిది ధర్మాగ్రహమే అని అంతా తేల్చేస్తున్నారు.