పెళ్లానికి అద్భుతమైన పెళ్లి కానుక.. చంద్రునిపై ‘స్పేస్’ తీసుకున్నాడు!

Update: 2020-12-27 09:30 GMT
భార్యలను ఏదో విధంగా సర్ ఫ్రైజ్ చేయడానికి చూస్తుంటారు కొందరు భర్తలు. తమ బెటర్ హాఫ్ ను ఎంతలా ప్రేమిస్తున్నామో మాటలు చాలవంటూ.. చేతల్లో చూపిస్తుంటారు. అలాంటి ఓ ఆదర్శపతి తన పత్నికోసం ఏం చేయాలా.. అని ఆలోచించి ఆకాశమంత తన ప్రేమను ఆకాశంలోనే చూపించాడు.

రాజస్థాన్‌లోని అజ్మర్‌ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర అనీజా అనే వ్యక్తికి తన భార్య అంటే చెప్పలేనంత ప్రేమ. త్వరలో వారు ఎనిమిదో మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోబోతున్నారు. ఈ మ్యారేజ్ డే ఎంతో మెమరబుల్ గా ఉండాలని భావించిన ధర్మేంద్ర.. తన భార్యకు జీవిత కాలం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చాడు.

చంద్రుడిపై మూడు ఎకరాలను కొనేసి భార్యకు గిఫ్టుగా ఇచ్చాడు ధర్మేంద్ర. దీంతో.. ఆమె ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ విషయంపై అనీజా మాట్లాడుతూ.. 'డిసెంబర్‌ 24న మా పెళ్లి రోజు. ఈ సందర్భంగా అందరిలా కార్లు, నగలు కాకుండా నా భార్యకు ఏదైనా స్పెషల్‌ బహుమతి ఇద్దామనుకున్నా. అందుకే చంద్రుడి మీద ప్లాట్‌ కొనిచ్చాను. బహుశా చంద్రమండలం మీద స్థలాన్ని కొన్న మొదటి రాజస్థాన్‌ వ్యక్తిని నేనే అనుకుంటా' అని చెప్పుకొచ్చాడు.

'ప్రపంచం అవతల నుంచి బహుమతి అందుకున్నందుకు నా భార్య సంతోషంగా ఉంది. కొనుగోలు సర్టిఫికెట్‌ చూస్తుంటే.. నాకిప్పుడు చంద్రుడి మీదే ఉన్నట్లుగా అనిపిస్తోంది. నా భార్య సాప్నా ఆనందంతో గాల్లో తేలుతోంది.’ అంటున్నాడు ధర్మేంద్ర. కాగా.. అమెరికాలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌ కంపెనీ ద్వారా అనీజా.. చందమామ మీద స్థలాన్ని కొనుగోలు చేశాడట.
Tags:    

Similar News