భార్యాభర్తల మధ్య చెలరేగిన సంభాషణ.. చినికి చినికి గాలి వానలా మారింది. వద్దని చెబుతున్న పనినే చేస్తుండటంతో విసిగిపోయిన ఆ కలెక్టర్.. భార్యను వద్దనుకున్నాడు. ఆమెతో వేగలేనని డిసైడైపోయి విడాకులకు దరఖాస్తు చేశాడు. ఆమె కూడా పోటీగా ఆందోళనకు దిగిన సంఘటన చర్చనీయాంశంగా మారింది.
2013 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ధర్మేంద్ర కుమార్ బిహార్ రాష్ట్రంలోని జామూయి జిల్లా కలెక్టర్. 2015 మార్చి 11 న పాట్నాకు చెందిన యువతి వత్సలతో వివాహమైంది. ఆమె చదువంతా దాదాపు ఢిల్లీలోనే జరిగింది. ఆ తరువాత తిరిగి భర్త వద్దకు వచ్చింది. వచ్చిన కొత్తల్లో దుస్తులు బాగా నిండుగా వేసుకుని హుందాగా ఉండేది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య దుస్తుల విషయంలో గొడవలు మొదలయ్యాయి. కాపురం పాత బడే కొద్ది వత్సల పాత పద్ధతిలోకి వెళ్లిపోయింది. ఢిల్లీలో మోడరన్ దుస్తులు అలవాటు కాబట్టి షార్ట్ సైజ్ బట్టలతో తిరగడం ప్రారంభించింది.
భార్య పొట్టి దస్తులతో ఇంట్లోనే కాక వీధుల్లో తిరుగుతూ - ఇంగ్లీష్ మాట్లాడుతుండటం కలెక్టర్ ధర్మంద్రకుమార్ కు నచ్చలేదు. నలుగురిలో అవమానకరంగా ఫీలయ్యాడు. ఆమె చెప్పిన పద్ధతి మార్చుకోవడం లేదని అలిగి విడాకులకు వెళ్లాడు. ఆమె కూడా తక్కువ తినలేదు కదా.. న్యాయం చేయాలంటూ రోడ్డుకెక్కింది. భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. కాపురంలో గొడవలపై మాట్లాడేందుకు తాను తల్లితో కలిసి ఇంటికి రాగా గార్డులు అడ్డుకున్నారని పేర్కొంది. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని రచ్చ రచ్చ చేసి పడేస్తుంది. దాంతో ఈ వివాదాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని ధర్మేంద్ర తేల్చి చెప్పారు.
జిల్లా స్థాయి అధికారి ఇంటి గొడవ రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వారే.. గొడవ చేసుకోవడమేటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఉంటే కలిసి కూర్చొని వివాదాన్ని పరిష్కరించుకోవాలి గాని, ఇలా రచ్చకెక్కడమేంటని అంటున్నారు. ఈ ఇంటి గొడవ ఎంతవరకు దారితీస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.