ఇంతకుముందు లాగా క్రికెటర్లు ఒంటరిగా విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు క్రికెటర్లు చాలా బిజీ. ఏడాదంతా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఏడాదిలో ఖాళీ దొరికే రోజులు చాలా తక్కువ. కాబట్టి ఫ్యామిలీని కూడా వెంటేసుకుని తిరగాల్సిందే. విదేశీ పర్యటనలకూ వాళ్లను తీసుకెళ్లాల్సిందే. ఈ క్రమంలో క్రికెటర్ల కుటుంబాల మధ్య కూడా మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి. వారి పిల్లలు కూడా బాగా క్లోజ్ అయిపోతున్నారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఓపెనర్ శిఖర్ ధావన్ కుటుంబాల మధ్య కూడా అలాంటి అనుబంధమే ఏర్పడింది. వారి పిల్లలు చాలా క్లోజ్ అయిపోయారు.
తాజాగా ధోని భార్య సాక్షి తన కూతురు జివా.. ధావన్ కొడుకు జోరావర్ కలిసి ఓ బీచ్ లో ఆడుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సెలబ్రెటీల పిల్లలనే ఫీలింగ్ రానివ్వకుండా ఆ పిల్లలిద్దరూ ఇసుకలో సరదాగా ఆడుకుంటున్న తీరు ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం టీమ్ ఇండియా ఆటగాళ్లు వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రెండో వన్డే ముగిశాక ఆంటిగ్వాకు వెళ్తూ మధ్యలో బీచ్ లో సేదదీరిన సమయంలో తీసిన ఫొటో ఇది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ వెస్టిండీస్ తో ఐదు వన్డేల సిరీస్ ఆడుతోంది. తొలి వన్డే వర్షం వల్ల రద్దవగా.. రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/