బీజేపీదే గెలుపుని అఖిలేష్ ఒప్పేసుకున్నారా...?

Update: 2022-03-08 15:32 GMT
ఉత్తరప్రదేశ్ లో అధికార మార్పిడి అన్నది ప్రతీ అయిదేళ్ళకు పార్టీల మధ్య జరుగుతుంది. అది ఒక సెంటిమెంట్ గా ఉంది. దానికి తోడు అయిదేళ్ల బీజేపీ పాలన మీద జనాలకు మోజు పెద్దగా లేదు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తెగ ఊదరగొట్టింది.

యోగీ చరిష్మా. మోడీ మ్యాజిక్ రెండూ కూడా ఈసారి యూపీ ఎన్నికల్లో అసలు పనిచేయవని కూడా చాలా మంది రాజకీయ మేధావులు జోస్యం చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్ చూస్తే దాదాపుగా తొంబై తొమ్మిది శాతం బీజేపీయే గెలుస్తుంది అని తేల్చి చెప్పేశాయి.

ఈ నేపధ్యంలో అపోజిషన్ పార్టీ, రేపటి రోజున తానే సీఎం అని ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అయితే వీటిని చూసి తెగ పరేషాన్ అయ్యారు. ఆ మీదట తేరుకుని ఎగ్జిట్ పోల్స్ ఎపుడూ అంతే. అవి పక్కా భోగస్. ఎగ్జాక్ట్ రిజల్ట్స్ లో మాదే విజయమని చెప్పుకొచ్చారు. కడు ధీమా వ్యక్తం చేశారు. తీరా ఇరవై నాలుగు గంటలు కాక ముందే ఫ్లేట్ తిరగేశారు.

ఇపుడు ఆయన అంటున్న కొత్త మాట ఏంటి అంటే ఈవీఎంలను బీజేపీ మ్యానేజ్ చేసింది అని. ఇది నిజంగా సంచలన ఆరోపణే. అసలు రిజల్ట్స్ కి ఇంకా రెండు రోజులు మాత్రమే వ్యవధి ఉన్న వేళ అఖిలేష్ ఇలా బెంగటిల్లి మాట్లాడడం అంటే కచ్చితంగా ఎస్పీ ఓడిపోతోందని ఆయన ఒప్పేసుకున్నారా అన్నదే చర్చగా ఉంది. బలమైన ప్రత్యర్ధిగా ఉన్న ఎస్పీ ఎపుడైతే ఈ తరహా ఆరోపణలు చేస్తోందో అవి ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఇంకా అసలు రిజల్ట్ ని బయట పెట్టేస్తున్నాయని అంటున్నారు.

నిజానికి ఎస్పీ టఫ్ ఫైట్ ఇచ్చింది. ఒక దశలో చూస్తే మార్చి 10 నుంచి అఖిలేష్ రాజ్యమే అని కూడా అంతా అన్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన ఒక్క రోజు తేడాలో అఖిలేష్ ఇలా మాట్లాడడం చూస్తే ఎక్కడో తేడా కొడుతోంది అని ఎస్పీ పెద్దలు తలచి ఉండాలి. అయినా కూడా  యూపీ ఎన్నికలు ఏడు విడతలుగా దాదాపు నెల రోజుల పాటు జరిగాయి.

ఒక వేళ ఈవీఎంలను మ్యానేజ్ చేయడం అంటే తొలి విడతాలోనో రెండవ విడతలోనో ఈ ఆరోపణలు ఎందుకు చేయలేదు అన్న చర్చ కూడా వస్తోంది. ఇంకో వైపు ఇవే ఈవీఎంలతో పంజాబ్ ఎన్నికలు కూడా జరిగాయి, మిగిలిన చోట్ల కూడా జరిగాయి. మరి అక్కడ ఎందుకు బీజేపీ మ్యానేజ్ చేసుకోలేకపోయింది అన్న డౌట్లూ వస్తాయి.

ఏతా వాతా తేలేది ఏంటి అంటే మొత్తం పోలింగ్ సరళిని సమీక్షించుకున్న మీదటనే తమకు విజయావకాశాలు తక్కువ అని ఎస్పీ నేతలు గ్రహించారని అంటున్నారు. సో ఎస్పీ ఇపుడు తమ గెలుపుపై ఇలా సందేహాలు వ్యక్తం చేస్తున్న వేళ యూపీలో మరోసారి బీజేపీ జెండా ఎగరేయబోతోందా. అంటే మార్చి 10 వరకూ వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News