టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించు కున్న విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో కలిపి.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆయన పర్య టించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి జిల్లా కేంద్రంలోనూ.. బహిరంగ సభ నిర్వహిస్తారు.. వైసీపీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనున్నారు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. టీడీపీ విజయం దక్కించుకునేలా వ్యూహాత్మకంగా అడగులు వేయాలని భావిస్తున్నారు.
అయితే.. ఈ యాత్రను ఎక్కడ నుంచి ప్రారంభించాలనే విషయంపై చర్చసాగుతోంది. ప్రస్తుతం.. సీఎం జగన్ సొంత జిల్లాపై కన్నేసిన చంద్రబాబు..ఇక్కడ వైసీపీని డైల్యూట్ చేయడం ద్వారా.. పార్టీపై పైచేయి సాధించాలని నిర్నయించుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా.. కడపలో చంద్రబాబు పర్యటించారు. ఈ పర్యటనకు భారీ రెస్పాన్స్ లబించింది. చంద్రబాబుకు ప్రజలు అడుగడుగునా.. ఘన స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు బస్సు యాత్రను కూడా కడప జిల్లాలోని జగన్ సొంత నియోజకవర్గం పులివెందు ల నుంచి ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీలోని నాయకులు కూడా చంద్రబాబు కు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. పులివెందులలో పర్యటన ప్రారంభించాక.. వైసీపీ నేత లు ఆగడాలకు దిగితే.. దీనిని కూడా తమకు అడ్వాంటేజ్‌గా మలుచుకునే అవకాశం ఉందని చెబుతు న్నారు.
టీడీపీ యాత్రను అడ్డుకున్నారంటూ.. ఊరూ వాడా టాంటాం చేసే ఛాన్స్ దక్కుతుందని కూడా నాయకు లు చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం. ఇక్కడ రాజా రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని.. అని చెప్పొ చ్చని కూడా చెప్పారట. ఇదిలావుంటే,.. ఇటీవల చంద్రబాబు కడపలో పర్యటించినప్పుడు.. ప్రభుత్వం ఇంటిలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంది. దీని ప్రకారం.. ఈ సభలకు వచ్చిన వారంతా కూడా పెయిడేన ని.. నిజమైన క్యాండిడేట్స్ కాదని.. ప్రభుత్వానికి ఆఫీసర్లు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా తెలిసిందట.
అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. నిజమైన కేడరే వచ్చిందని.. నమ్మించే ప్రయత్నం చేసిందని, అంటు న్నారు. మొదట పులివెందుల నుంచి మొదలు పెట్టి.. కడప జిల్లా అంతటి నుంచి జనాలను తరలించి.. పులివెందలోనే వైసీపీకి వ్యతిరేకత ఉందని చెప్పడానికి బాగుంటుందని.. చంద్రబాబు ఆలోచనగా ఉంద ని అంటున్నారు. ఎందుకంటే.. జగన్ కూడా ఈ సారి కుప్పంలో ఎందుకు గెలవ కూడదు.. అని అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ వ్యూహానికి చంద్రబాబు ప్రతివ్యూహం వేస్తున్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయనకు, ఆయన పార్టీకి కూడా ఎదురు గాలి వీస్తోందని చెప్పడానికి ఇదే మంచి అవకాశంగా చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. కపలో 2019 ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాల్లో వైసీపీ గెలిస్తే.. ఇప్పుడు.. టీడీపీకి మూడు సీట్లు అనుకూలంగా ఉన్నాయని.. అంటున్నారు. కాపు సామాజిక వర్గం ఉండే దగ్గర టీడీపీ బలం పరిగిందని, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు.. అని అంటున్నారు.
ఆయా సీట్లలో రెడ్డి సామాజిక వర్గం కనుక 30 శాతం ఓట్లు చీలితే.. టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి చంద్రబాబు పులివెందుల నుంచి మొదలు పెడతారో.. లేక.. గ్యాసిప్‌గా ఉంటుందో చూడాలని టీడీపీ వర్గాలే చెబుతుండడం గమనార్హం.